రుణాలు చెల్లించి సహకరించాలి
ABN , Publish Date - Mar 28 , 2025 | 11:33 PM
రేచింతల సహకార సంఘం నుంచి రైతులు పొందిన రుణాల ను సకాలంలో చెల్లించి స హకార పరపతి సంఘాని కి రైతులు సహకరించాలని రేచింతల సహకార సంఘం అధ్యక్షుడు లక్ష్మి కాంత్ రెడ్డి అన్నారు.

ఆత్మకూరు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : రేచింతల సహకార సంఘం నుంచి రైతులు పొందిన రుణాల ను సకాలంలో చెల్లించి స హకార పరపతి సంఘాని కి రైతులు సహకరించాలని రేచింతల సహకార సంఘం అధ్యక్షుడు లక్ష్మి కాంత్ రెడ్డి అన్నారు. మహాజన సభ సమావే శంలో భాగంగా వీర రాఘవపూర్‌లో శుక్రవారం రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడారు. సహకార సంఘం లో 1,329 మంది రైతులు సభ్యులుగా ఉన్నార న్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న ఎరువులు, విత్తనాలు సకాలంలో రైతులకు అం దజేసేలా కృషి చేస్తున్నామని తెలిపారు. రైతు లు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తేనే తిరిగి రుణం పొందేందుకు అవకాశం ఉంటుం దని గుర్తు చేశారు. లోకేష్ కుమార్, రవికుమా ర్, కొండన్న, నాగన్న, తిరుపతన్న, కురుమన్న, హనుమంత్, బాలయ్య, దేవేంద్రం పాల్గొన్నారు.