Share News

ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు

ABN , Publish Date - Mar 28 , 2025 | 11:14 PM

కొల్లాపూర్‌ నియోజకవర్గ ప్రజలకు , విద్యార్థులకు రవాణా సౌకర్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూ పల్లి కృష్ణారావు వెల్లడించారు.

  ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
బస్సును ప్రారంభిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

- మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి

కొల్లాపూర్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): కొల్లాపూర్‌ నియోజకవర్గ ప్రజలకు , విద్యార్థులకు రవాణా సౌకర్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూ పల్లి కృష్ణారావు వెల్లడించారు. కొల్లాపూర్‌ ఆర్టీసీ బస్‌ డిపోకు మంజూరైన ప ది కొత్త బస్సులను ప్రారంభించేందుకు హాజరైన మంత్రికి ఆర్‌ఎంపీ సంతోష్‌, డిపో మేనేజర్‌ ఉమాశంకర్‌ పుష్ఫగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. శుక్ర వారం మంత్రి పది ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. కొల్లాపూర్‌ నుంచి వ యా కల్వకుర్తి మీదుగా యాదగిరి గుట్టకు బయలుదేరుతున్న బస్సును జెం డా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కొల్లాపూ ర్‌ నియోజకవర్గ ప్రజలకు విద్యార్థులకు రవాణా సౌకర్యంలో ఇబ్బందులు తలె త్తుతున్నా యని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ దృష్టికి తాను తీసుకువెళ్లగా, వెంటనే స్పందించారన్నారు. ఆర్డీవో భన్సీలాల్‌, డిపో మే నేజర్‌ ఉ మా శంకర్‌, కాంగ్రె స్‌ పార్టీ ప్రజా ప్రతిని ధులు, డిపో సూపర్‌ వైజర్లు, సిబ్బం ది, కం డక్టర్లు, డ్రైవ ర్లు, కాం గ్రెస్‌ కార్యకర్త లు పాల్గొ న్నారు.

Updated Date - Mar 28 , 2025 | 11:14 PM