దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి ఆదర్శం
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:38 PM
దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి అందరికీ అసుసరణీయమని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు.

అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ
గద్వాల న్యూటౌన్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి అందరికీ అసుసరణీయమని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో దొడ్డికొమురయ్య జయంతి వేడుకలను కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈసందర్బంగా ఆదనపు కలెక్టర్ ఆ యన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనం గా నివాళి అర్పించారు. ఈసందర్బంగా అదన పు కలెక్టర్ మాట్లాడుతూ.. పోరాట యోధుడు దొడ్డికొమురయ్య జయంతి వేడుకలను అధికారికంగా జరుపుతున్నట్లు తెలిపారు. కార్యక్రమం లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారి రమేష్‌బాబు, ఎస్సీ సంక్షేమశాఖ అధి కారిని సరోజ, తహసీల్దార్ మల్లికార్జున్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.