విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచాలి
ABN , Publish Date - Mar 27 , 2025 | 11:06 PM
విద్యార్థులలో సృజ నాత్మకతను పెంచే కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నా యక్ అన్నారు.

- కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేటటౌన్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులలో సృజ నాత్మకతను పెంచే కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నా యక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని శ్రీ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేయబడ్డ ప్రభుత్వ ప్రాథమిక పా ఠశాలల నైపుణ్య ప్రదర్శన వేదిక విద్యా కదంబం కార్యక్రమాన్ని ఏ ర్పాటు చేయగా కలెక్టర్ హాజర య్యారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో మౌలిక భాషా గణిత సామర్థ్యాల సాధన కార్య క్రమాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన వివిధ కృత్యా ల్లో పాలు పంచుకోవాలన్నారు. వారిని పలు రకాలుగా ప్రశ్నిస్తూ విద్యార్థుల ద్వారా సమాధానాలు రాబట్టి అభి నందించారు. ఇదే స్ఫూర్తితో రానున్న విద్యా సంవత్సరం మరింత మెరుగ్గా పని చేయాలన్నారు. విద్యాశాఖ పట్ల ప్రత్యేక దృష్టి ఉన్న కారణంగానే మన జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధన సాగుతుందన్నారు. ఇది ఒక నిరంతరం ప్రక్రియ అని ఈ కార్యక్రమం మ రింత సమర్థవంతంగా నిర్వహించడానికి పూర్తి సహా య సహకారాలు జిల్లా ద్వారా అందుతాయన్నా రు. పిల్లల నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న వివిధ పాఠశాలల ఉపా ధ్యాయులను హెచ్‌ఎంఎలను, సహకరిస్తున్న అలోకిత్ ఫౌండేషన్ సభ్యులైన సాయిప్రమోద్ యదునందన్ తదితరులను ఆమె అభినందించారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కా ర్యక్రమాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి కలెక్టర్ వీక్షించారు. సీఎం జిల్లా కలె క్టర్‌గా వ్యవహరిస్తూ ఇద్దరు విద్యార్థులు చేసిన ప్రదర్శన చాలా బాగుందని కలెక్టర్ ప్రత్యేకంగా అభినం దించారు. జిల్లా విద్యాధికారి గోవిందరాజులు, ఏఎంవో విద్యా సాగర్, ఎంఈవోలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయు లు, ఉపాధ్యాయులు, చిన్నారులు పాల్గొన్నారు.