Share News

రాజీ మార్గంతోనే కేసులు పరిష్కరించుకోవాలి

ABN , Publish Date - Mar 21 , 2025 | 11:30 PM

రాజీ మార్గంతోనే కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్‌ అబ్దుల్‌ రఫీ అన్నారు.

రాజీ మార్గంతోనే కేసులు పరిష్కరించుకోవాలి
మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్‌ అబ్దుల్‌రఫీ

- జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్‌ అబ్దుల్‌రఫీ

నారాయణపేట టౌన్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): రాజీ మార్గంతోనే కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్‌ అబ్దుల్‌ రఫీ అన్నారు. శుక్రవారం జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కోఆర్డినేషన్‌ మీ టింగ్‌లో జరగబోయే జాతీయ లోక్‌ అదాలత్‌ను ఉద్ధేశించి మాట్లాడారు. రాజీమార్గం ద్వారా కేసు లు పరిష్కరించుకోవడానికి లోక్‌ అదాలత్‌ ఎం తో ఉపయోగపడుతుందన్నారు. మే 10న జరిగే అదాలత్‌ కార్యక్రమం విజయవంతం చేయడా నికి అన్ని టీంలు సిద్ధంగా ఉండాలన్నారు. లోక్‌ అదాలత్‌ను కక్షిదారులు ఉపయోగించుకునేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. మార్చి 8వ తే దీన జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌లో మొత్తం 9,825 కేసులు డిస్పోసల్‌ చేసి నారాయణపేట జిల్లాను 13వ స్థానంలో ఉంచామని జిల్లా ప్ర ధాన న్యాయమూర్తి పోలీసు అధికారులకు తెలిపారు. ఈ ర్యాంకు రావడానికి కృషి చేసిన పోలీ సు అధికారులు, కోర్టు కానిస్టేబుల్స్‌ను అభినం దించారు. జిల్లాలో డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు యధావిధిగా కొనసాగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎజెండాలో అంశాలను నాన్‌ బెయి లబుల్‌ వారెంట్‌ కేసులను, చార్జిషీట్‌ ఎన్‌ఐ యాక్ట్‌ పెండింగ్‌లో ఉన్నాయా చర్చించారు. ముందుగా హైకోర్టు న్యాయాధికారి ఆదేశానుసారం జైలులో ఉన్న ఖైదీల కేసులను డిస్పోసల్‌ చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.

డీఎస్పీ లింగయ్య మాట్లాడుతూ మార్చి 8న జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌లో పోలీసులం దరు ఏవిధంగా సహకరించి కేసులను పరిష్కరించారో అదేవిధంగా మే 10న జరగబోయే జాతీయ లోక్‌ అదాలత్‌లో కూడా రాజీ మార్గం ద్వారా కేసుల పరిష్కారానికి తగు చర్యలు తీసు కోవాలని పోలీస్‌ సిబ్బందికి ఆదేశించారు. సమా వేశంలో సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి వింద్య నాయక్‌, జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఫర్హీన్‌ బేగం, కోస్గి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సురేష్‌కుమార్‌, బాలప్ప, ఆర్డీవో ఆఫీసర్‌, డిఫెన్స్‌, కౌన్సిల్‌ లక్ష్మిపతిగౌడ్‌, నాగేశ్వరి, అధికారులు పాల్గొ న్నారు.

Updated Date - Mar 21 , 2025 | 11:30 PM