Share News

కాంగ్రెస్‌ పనైపోయింది

ABN , Publish Date - Mar 23 , 2025 | 11:39 PM

‘రాష్ట్రంలో కాం గ్రెస్‌ పనైపోయింది.. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చ తికిల పడింది.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.. బీజేపీ గెలుపును ఎవ్వరు ఆపలేరు’’ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌ నగర్‌ ఎంపీ డీకే అరుణ అన్నారు.

 కాంగ్రెస్‌ పనైపోయింది
సమావేశంలో మాట్లాడుతున్న మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ

- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే

- సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ

గద్వాల, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) ‘రాష్ట్రంలో కాం గ్రెస్‌ పనైపోయింది.. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చ తికిల పడింది.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.. బీజేపీ గెలుపును ఎవ్వరు ఆపలేరు’’ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌ నగర్‌ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం ఎస్‌కే ఈవెంట్‌ హాల్‌లో జిల్లా నూతన అధ్య క్షుడితో పాటు రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆదోని ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.... ఆ రు గ్యారెంటీలు అమలు చేయలేక కాంగ్రెస్‌ ప్రజలను మోసం చేస్తున్నదన్నారు. అరకొర రుణమాఫీ చేసి అయిపోయిందంటోందని వి మర్శించారు. పీఆర్‌సీలు లేవు.. ఉద్యోగులకు డీఏలు లేవు.. రైతు భ రోసా లేదు అని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన పైసలతోనే గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం అవుతున్నాయని వివరించారు. ఇచ్చిన హా మీలను అమలు చేయలేక కేంద్రంపై నిందలు వేస్తున్నారని అన్నా రు. బీఆర్‌ఎస్‌ పార్టీ అరాచకాలను వద్దనుకొని కాంగ్రెస్‌ను గెలిపించారని అన్నారు. నేను మహబూబ్‌నగర్‌ ఎంపీగా ఉన్నప్పటికీ ఎ ల్లప్పుడు గద్వాల ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నానని వివరించారు. జిల్లా నూతన అధ్యక్షుడు, కౌన్సిల్‌ సభ్యులతో పాటు నాయకులు బూత్‌ స్థాయి నుంచి పార్టీ పటిష్టతకోసం పనిచేయాలని సూ చించారు. గత ఎంపీ ఎన్నికలలో గద్వాలలో 20వేల మెజార్టీ ఇచ్చార ని, వచ్చే ఎన్నికల్లో కూడా గద్వాలలో బీజేపీ జెండా ఎగురుతుందని వివవరించారు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధికి పాటుపడుతున్న డీకే అరుణ ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టం అని వివరించారు. గద్వాలకే కాదు.. ఢిల్లీ స్థాయిలో పేరు న్న నాయకురాలు అని కొనియాడారు. అరుణ సారథ్యంలో బీజేపీ గెలుపు సాధ్యమేనని వివరించారు. జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్వి డీకే స్నిగ్ధారెడ్డి, రవికుమార్‌ ఎగ్బోటే, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు అక్కల రమాదేవి, బండల వెంకట్రాములు, జయలక్ష్మి, పట్టణ అధ్యక్షురాలు జయశ్రీ, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కృష్ణవేణి, నాయకులు పోతుల భరత్‌, శివారెడ్డి, రాజగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 11:39 PM