Share News

Nagar kurnool: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. రంగంలోకి హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు..

ABN , Publish Date - Feb 23 , 2025 | 11:47 AM

నాగర్ కర్నూల్: అచ్చంపేట మండలం దోమలపెంట వద్ద ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.

Nagar kurnool: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం.. రంగంలోకి హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు..
SLBC tunnel Incident

నాగర్ కర్నూల్: అచ్చంపేట మండలం దోమలపెంట (Domalapenta) వద్ద శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్‌బీసీ (SLBC) టన్నెల్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సొరంగంలో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులను రక్షించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కార్మికులను కాపాడేందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) ఆధ్వర్యంలో సహాయక బృందాలు సైతం రంగంలోకి దిగాయి.


ప్రమాదం జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్న హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ శాంతి కుమారి ఆదేశాలతో హైడ్రా రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యాయి. సంఘటనా స్థలంలో ఇతర అధికారులతో కలిసి కమిషనర్ రంగనాథ్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు దోమలకుంట ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరుకున్నారు. ఆదివారం ఉదయం బేగంపేట నుంచి దోమలపెంటకు హెలికాఫ్టర్‍లో బయలుదేరిన మంత్రులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.


సహాయక చర్యలను పర్యవేక్షించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలపై దిశానిర్దేశం చేశారు. కార్మికులను కాపాడేందుకు టన్నెల్‌లో సహాయక చర్యలు శనివారం నుంచీ కొనసాగుతున్నాయని మంత్రి జూపల్లి వెల్లడించారు. రెస్క్యూ టీమ్‌లు రాత్రి నుంచి అక్కడే పని చేస్తున్నాయని చెప్పారు. సొరంగం లోపలికి ఆక్సిజన్ పంపుతున్నామని, వాటర్ తోడేసే పనులు నిరంతరం సాగుతున్నాయని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే టన్నెల్ బోర్ మిషన్ (TBM) వరకూ సహాయక బృందాలు చేరుకున్నాయని, మరికొన్ని గంటల్లో కార్మికులను రక్షిస్తామని మంత్రి జూపల్లి ధీమా వ్యక్తం చేశారు.


రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్..

కాగా, సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. ఎస్ఎల్‌బీసీ ప్రమాద ఘటనపై రాహుల్ ఆరా తీశారు. ప్రమాదం, సహాయక చర్యల గురించి ఆయనకు ముఖ్యమంత్రి వివరించారు. బాధితులను సురక్షితంగా బయటకు తీసుకొస్తామని చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం స్పందించిన తీరును, సహాయక చర్యలను రాహుల్ గాంధీ అభినందించారు. దాదాపు వీరి సంభాషణ 20 నిమిషాలపాటు సాగింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్..

Road Accident: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్వాకం.. ఎంత పని జరిగింది..

Updated Date - Feb 23 , 2025 | 12:04 PM