కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి
ABN , Publish Date - Apr 04 , 2025 | 11:13 PM
వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.

- కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేటటౌన్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం మలువు వద్ద వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సివిల్ సప్లయి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కోట్ల నిధులను కేటాయించి రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని, గతేడాది మా దిరిగానే ఈసారి కూడా సన్నాలకు రూ.500 బో నస్ ఇస్తుందన్నారు. కేంద్రాల్లో దొడ్డు, సన్నరకం వడ్లను కొనేందుకు వేర్వేరుగా కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. అలాగే కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను వేర్వేరు రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. కేంద్రాల్లో ఫ్లెక్సీలు, తేమ శాతాన్ని కొలిచే యంత్రాలు, గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో మొగులప్ప, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ సైదులు, ఐకేపీ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.