Share News

అంగన్‌వాడీ కేంద్రాల పరిశీలన

ABN , Publish Date - Apr 03 , 2025 | 10:54 PM

నర్వ మండలం పాతర్‌చేడ్‌ గ్రామంలోని అంగన్‌వాడీ-3 కేంద్రాన్ని గురువారం కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

అంగన్‌వాడీ కేంద్రాల పరిశీలన
అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

నారాయణపేటటౌన్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): నర్వ మండలం పాతర్‌చేడ్‌ గ్రామంలోని అంగన్‌వాడీ-3 కేంద్రాన్ని గురువారం కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో చిన్నారులకు కుర్చీలు, ఆట పరికరాలు అందుబాటులో ఉన్నాయా, లేదా అని అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలోని చిన్నారుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించారు. అంగన్‌ వాడీ కేంద్రం-2 ఇరుకైన గదుల్లో కొనసాగుతుండడం పట్ల ఆమె అసహనం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా విశాలమైన గదులు ఉన్న చోటికి కేంద్రాన్ని మా ర్చాలని ఎంపీడీవో శ్రీనివాస్‌ను ఆదేశించారు. అనంతరం మండలంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనుల గురించి కలెక్టర్‌ అధికారులతో ఆరా తీశారు.

Updated Date - Apr 03 , 2025 | 10:54 PM