అవుట్ చెక్‌పోస్టుకు స్థల పరిశీలన
ABN , Publish Date - Mar 27 , 2025 | 11:23 PM
జూరాల ప్రాజెక్టు వ ద్ద పోలీస్ అవుట్ చెక్‌పోస్టు కోసం స్థ లాన్ని గురువారం వనపర్తి ఎస్పీ రా వుల గిరిధర్ పరిశీలించారు.

అమరచింత, మార్చి 27 (ఆంధ్రజ్యోతి) : జూరాల ప్రాజెక్టు వ ద్ద పోలీస్ అవుట్ చెక్‌పోస్టు కోసం స్థ లాన్ని గురువారం వనపర్తి ఎస్పీ రా వుల గిరిధర్ పరిశీలించారు. ఈ సం దర్భంగా ప్రాజెక్టు సమీపంలోని సత్య సాయి తాగునీటి సంప్ హౌస్ పక్కన ఉన్న నాలుగు ఎకరాల ప్రభుత్వ స్థ లాన్ని స్థానిక అధికారులతో కలిసి ప రిశీలించారు. ఈ సందర్భంగా మాట్లా డారు. జూరాల ప్రాజెక్టు వద్ద అత్యం త ప్రతిష్టాత్మకంగా సర్వాంగ సుంద రంగా పోలీస్ అవుట్ చెక్‌పోస్టును త్వ రలో నిర్మించనునట్లు తెలిపారు. స్థల పరిశీలన అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు పం పి, పనులు ప్రారంభమయ్యే చర్యలు తీసుకుం టామన్నారు. జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిస్థా యిలో అదుపులో ఉన్నాయని, ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను క్షేత్రస్థాయిలో కొనసాగించాలని ఆదే శించారు. ఈ సందర్భంగా జూరాల ప్రాజెక్టు వ ద్దకు వెళ్లి అక్కడ నీటి నిలువ శాతం, ప్రస్తుతం ప్రాజెక్టులోని నీటిని అక్కడున్న అధికారులతో అ డిగి తెలుసుకున్నారు. అనంతరం అమరచింత శివారులోని నాగులకుంట భూమిని ఎస్పీ ప రిశీలించారు. కార్యక్రమంలో ఎస్పీతో పాటు సీఐ శివకుమార్, ఎస్‌ఐ సురేష్, అసిస్టెంట్ ఇంజినీర్ ఆంజనేయులు, దామోదర్ పాల్గొన్నారు.