Share News

పాఠశాలలను సందర్శించిన రాష్ట్ర స్థాయి బృందం

ABN , Publish Date - Mar 27 , 2025 | 11:13 PM

మండలంలోని జాజాపూర్‌, కొల్లంపల్లి ప్రాథమిక పాఠశాలలను గురువారం ఏక్‌ స్టెప్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర స్థాయి బృందం సభ్యులు అవంతి, శరణ్‌, ఆకాశ్‌లు సందర్శించారు.

పాఠశాలలను సందర్శించిన రాష్ట్ర స్థాయి బృందం
విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలిస్తున్న బృందం సభ్యులు

నారాయణపేటరూరల్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జాజాపూర్‌, కొల్లంపల్లి ప్రాథమిక పాఠశాలలను గురువారం ఏక్‌ స్టెప్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర స్థాయి బృందం సభ్యులు అవంతి, శరణ్‌, ఆకాశ్‌లు సందర్శించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌(ఏఐ)లో విద్యార్థుల గణితం, తెలుగు సామర్థ్యాలతో పాటు, కంప్యూటర్‌ లాగిన్‌ విధానం, విద్యార్థులకు తెలుగు పదాలు చదివించి పరిశీలించారు. ఏఐ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అకాడమిక్‌ మానిటరింగ్‌ అధికారి విద్యాసాగర్‌, పేట ఎంఈవో బాలాజీ, ఇన్‌చార్జి హెచ్‌ఎం బాలకిష్టప్ప, జాజాపూర్‌ హెచ్‌ఎం భారతి, భానుప్రకాశ్‌లు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2025 | 11:13 PM