టీడీపీకి పూర్వవైభవం తీసుకురావాలి
ABN , Publish Date - Mar 29 , 2025 | 11:09 PM
టీడీపీకి పూర్వవైభవం తీసుకరావాలని నాయకులు బాలప్ప, చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు.

మహబూబ్‌నగర్ టౌన్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి) : టీడీపీకి పూర్వవైభవం తీసుకరావాలని నాయకులు బాలప్ప, చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ మునిసిపాలిటీ పరిధిలోని బోయపల్లిలో టీడీపీ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు మురళి, శ్రీనివాస్‌గౌడ్, సాయన్నగౌడ్, వెంకటయ్య, వెంకటేశ్వర్లు, సప్తశిలారెడ్డి, తిరుపతయ్య, ఎంపీటీసీ మాజీ సభ్యుడు యాదయ్యగౌడ్, బాబా, హనుమంతు పాల్గొన్నారు.
మూసాపేట : పేద బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం టీడీపీకి ప్రతీ ఒక్కరు మద్దతు పలికి పూర్వవైభవం తీసుకరావాలని ఆ పార్టీ దేవరకద్ర నియోజకవర్గ ఇన్‌చార్జి జానార్దన్ అన్నారు. శనివారం అడ్డాకుల మండల కేంద్రంలో పార్టీ 43వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అడ్డాకుల మాజీ సర్పంచు మందడి శేఖర్‌రెడ్డి, నాయకులు గుడిబండ సత్యనారాయణరెడ్డి, రామూర్తినాయుడు, నరేష్, మల్లికార్జున్, యాదిరెడ్డి పాల్గొన్నారు.
చిన్నచింతకుంట : మండల కేంద్రంలో శనివారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులు జనార్ధన్, సీనియర్ నాయకులు గంజి కాంతయ్య ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాలర్పించారు.