Share News

అసలు ఏం జరిగింది..?

ABN , Publish Date - Mar 23 , 2025 | 11:41 PM

విద్యార్థిని ఆత్మహత్యాయ త్నానికి పాల్పడిన సంఘటనపై అధికారుల బృందం ఆదివారం వి చారణ చేపట్టారు.

అసలు ఏం జరిగింది..?
రాజాపూర్‌ కేజీబీవీలో విద్యార్థినీ, తల్లిదండ్రులతో విచారణ చేస్తున్న అధికారుల బృందం

- రాజాపూర్‌ కేజీబీవీలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థినితో పాటు విద్యార్థులు, టీచర్‌లతో అధికారుల ప్రత్యేక విచారణ

రాజాపూర్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థిని ఆత్మహత్యాయ త్నానికి పాల్పడిన సంఘటనపై అధికారుల బృందం ఆదివారం వి చారణ చేపట్టారు. రాజాపూర్‌ మండల కేంద్రంలోని కేజీబీవీలో సీని యర్‌లు కొట్టారని, టీచర్‌ తిట్టిందన్న కారణంతో 8వ తరగతి చదు వుకుంటున్న విద్యార్థిని వైష్ణవి శుక్రవారం సాయంత్రం ట్యాబ్లెట్స్‌ మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం పాఠకులకు విది తమే. సదరు విద్యార్థిని చికిత్స కోసం జడ్చర్ల ఏరియా ఆసుపత్రికి తరలించగా, కోలుకున్న వైష్ణవిని ఆదివారం ఆసుపత్రి వైద్యులు డిశ్చార్జి చేశారు. అనంతరం కేజీబీవీకి సదరు విద్యార్థినిని ఎంఈవో సుధాకర్‌ తీసుకెళ్లారు. కాగా, కేజీబీవీలో జరిగిన సంఘటనపై పూర్తి విచారణ చేపట్టి నివేదిక అందించాలంటూ డీఈవో ప్రవీణ్‌కుమార్‌ కు కలెక్టర్‌ విజయేందిరబోయి ఆదేశించారు. కలెక్టర్‌ ఆదేశాల మేర కు జీసీడీవో రాధ, రాజాపూర్‌, జడ్చర్ల మండల తహసీల్దార్‌లు వి ద్యాసాగర్‌రెడ్డి, నర్సింగ్‌రావు, సీఎంవో బాలుయాదవ్‌, ప్లానింగ్‌ కోఆర్డి నేటర్‌ సంపత్‌కుమార్‌, రాజాపూర్‌ ఎంఈవో సుధాకర్‌తో పాటు రా జాపూర్‌ జడ్పీహెచ్‌ఎస్‌ ఉపాధ్యాయురాలు తిరుపతమ్మలు ఆదివా రం కేజీబీవీలో విచారణ చేపట్టారు. కేజీబీవీలో చదువుకుంటున్న 30 మంది విద్యార్థినులతో 11 ప్రశ్నలతో కూడిన పత్రాన్ని అందించి, వి వరాలు సేకరించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ ఆత్మహత్యాయత్నా నికి పాల్పడిన సంఘటన వివరాలపై ఆరా తీశారు. ఆత్మహ త్యాయ త్నానికి పాల్పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే అంశాన్ని బాధి త విద్యార్థిని వైష్ణవి, అలాగే ఆమె తల్లిదండ్రులను అడిగి తెలుసుకు న్నారు. ఇదే సందర్భంలో కొందరు విద్యార్థినులు కేజీబీవీలోని టీచర్‌ లు వ్యవహరిస్తున్న తీరును, విద్యార్థినుల పట్ల అవలంబిస్తున్న వ్య వహార శైలిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణను అధికారుల బృందం చేపట్టారు. కాగా, విచారణ నివేదికను ఉన్నత అధికారులకు సమర్పించనున్న ట్లు స్థానిక విలేకరులకు వారు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థినిని రెండు రోజుల పాటు ఇంటికి తీసుకెళ్తారా అంటూ అధికారులు ప్రశ్నించగా హైదరాబాద్‌కు తీసుకెళ్తామంటూ తల్లిదండ్రులు జవాబిచ్చారు. జీవనం కోసం స్వంత తండా అయిన భూత్పూర్‌ మండలం అమృతండాను వదిలి హైదరాబాద్‌కు వెళ్లా మని ఈ సందర్బంగా అధికారుల దృష్టికి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. వచ్చే విద్యా సంవత్సరంలో తల్లిదండ్రుల సమక్షంలో ఉంటూ విద్యా భ్యాసం చేసేలా చర్యలు తీసుకుంటామంటూ ఈ సందర్భంగా అధికారులు సూచించగా, ఆలోచించి అభిప్రాయం వెల్లడిస్తామని వైష్ణవి తల్లిదండ్రులు అధికారులకు తెలిపారు.

Updated Date - Mar 23 , 2025 | 11:41 PM