Maoist encounter: దంతెవాడలో ఎన్‌కౌంటర్ మహిళా మావోయిస్టు రేణుక మృతి
ABN , Publish Date - Apr 01 , 2025 | 05:01 AM
ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తెలంగాణకు చెందిన మావోయిస్టు నాయకురాలైన రేణుక మృతి చెందింది. ఆమెపై తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో భారీ రివార్డులు ఉన్నాయి.

ఆమె దివంగత మావోయిస్టు
శాఖమూరి అప్పారావు భార్య
ఆమెపై రూ.45 లక్షల రివార్డు.. రేణుక
స్వస్థలం జనగామ జిల్లాలోని కడవెండి
జనగామ, చర్ల, చింతూరు, అల్వాల్, మార్చి 31(ఆంధ్రజ్యోతి): ఛత్తీ్‌సగఢ్‌లో బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దు అడవుల్లో సోమవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో తెలంగాణకు చెందిన మహిళా మావోయిస్టు గుమ్మడవెల్లి రేణుక అలియాస్ భాను అలియాస్ చైతే అలియాస్ సరస్వతి అలియాస్ దమయంతి మృతి చెందారు. దివంగత కేంద్ర కమిటీ సభ్యుడు శాఖమూరి అప్పారావు భార్య, మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ సభ్యురాలైన రేణుకపై తెలంగాణలో రూ.20 లక్షలు, ఛత్తీ్‌సగఢ్‌లో రూ.25 లక్షల రివార్డులు ఉన్నాయి. బీజాపూర్, దంతెవాడ సరిహద్దులోని ఇకేలీ బెలీనార్ అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో బలగాలు సోమవారం కూబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య రెండు గంటల పాటు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో రేణుక మృతి చెందారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఇన్సాస్ రైఫిల్, పేలుడు పదార్థాలు, ల్యాప్‌లాప్, ఇతర వస్తువులను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కాగా, గతవారం బీజాపూర్, దంతెవాడ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు సారయ్య అలియాస్ సుధాకర్(తెలంగాణ) మృతి చెందిన సంగతి తెలిసిందే.
ఎల్‌ఎల్‌బీ చేసి మావోయిస్టుగా..
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామానికి చెందిన రేణుక ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన తర్వాత 1996లో మావోయిస్టు పార్టీలో చేరారు. 2003లో డివిజన్ కమిటీ సభ్యురాలిగా పదోన్నతి పొందారు. 2020 నుంచి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా, రీజనల్ బ్యూరో ప్రెస్ టీమ్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టు పార్టీ ఆధ్వర్యంలో వెలువడే పలు పత్రికలకు రేణుక సంపాదకురాలిగా వ్యవహరించారు. 2005లో కేంద్ర కమిటీ సభ్యుడు శాఖమూరి ఆప్పారావు అలియాస్ రవిని ఆమె పెళ్లి చేసుకున్నారు. 2010లో నల్లమల్ల అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అప్పారావు మరణించారు. రేణుక సోదరుడు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు జీవీకే ప్రసాద్ అలియాస్ సుఖ్‌దేవ్ అలియాస్ గుడ్సా ఉసెండి 2014లో తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. రేణుక తల్లిదండ్రులు గుమ్మడవెల్లి సోమయ్య- జయమ్మలు అల్వాల్ ప్రాంతం వెంకటాపురంలోని రామచంద్రయ్య కాలనీలో ఉంటున్నారు. రేణుక చనిపోయిన విషయం తెలుసుకున్న వారు కన్నీరుమున్నీరయ్యారు. మావోయిస్టు పార్టీలోకి వెళ్లినప్పటి నుంచి రేణుకతో తమకు సంబంధాలు లేవని తల్లిదండ్రులు చెప్పారు. కాగా, మంగళవారం ఉదయానికి రేణుక మృతదేహాన్ని ఆమె స్వగ్రామానికి తీసుకురానున్నారు. ఇందుకోసం ఆమె అన్న జీవీకే ప్రసాద్ ఛత్తీ్‌సగఢ్‌కు చేరుకున్నారు.
ఈ వార్తలు కూాడా చదవండి
Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది
HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..
Read Latest Telangana News And Telugu News