ప్రజలకు ఆపదొస్తే అండగా నిలిచేది కమ్యూనిస్టులే
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:35 AM
నిరంతరం పేద ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజలకు ఆపద వస్తే అండగా నిలిచేది కమ్యూనిస్టులేనని సీపీఎం రాష్ట్రకార్యదర్శి వర్గసభ్యుడు ఎండీ అబ్బా స్ అన్నారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్
రామన్నపేట, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): నిరంతరం పేద ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజలకు ఆపద వస్తే అండగా నిలిచేది కమ్యూనిస్టులేనని సీపీఎం రాష్ట్రకార్యదర్శి వర్గసభ్యుడు ఎండీ అబ్బా స్ అన్నారు. సీపీఎం ప్రజా చైతన్య పాదయాత్రలో భాగంగా రామన్నపేట మండలంలోని నీర్నెంల గ్రామంలో జరిగిన బహిరంగ సభకు ఆ యన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అధికారంలోకి రావడం కోసం ప్రజల ఓట్లకోసం తప్ప ప్రజా సమస్యల పరిష్కారంకోసం ఏ ఒక్క పార్టీ కృషి చేయడం లేదని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం ప్రజలతో మమేకమై ఆపదొస్తేవారికి అండగా నిలిచేది ఎర్రజెండా అన్నా రు. పోరాడే వారికే గ్రామాల్లో పట్టంకట్టే విధంగా స్థానిక ఎన్నికల్లో ప్రజా పోరాటాలు నిర్వహించే కమ్యూనిస్టులకు అవకాశాలు ఇవ్వాలన్నారు.
సమస్యలను విస్మరించిన ప్రభుత్వం: ఆశయ్య
ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి పాలన చేస్తోందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆశయ్య అన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు.
నీర్నెంల శాఖ కార్యదర్శి నాగటి అంజయ్య అధ్యక్షతన జరిగిన పాదయాత్రలో జల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం, బోయిన ఆనంద్, కందుల హనుమంతు గొరిగి సోములు, గన్నెబోయిన విజయభాస్కర్, వేముల సైదులు, మేడి గణేష్, ఉపేందర్, జిల్లా కమిటీ సభ్యులు వనం ఉపేందర్, బల్గూరి అంజయ్య, కల్లూరి నగేష్, బండ జగన్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.