ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:13 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు.

కలెక్టర్ హనుమంతరావు
ఆత్మకూరు(ఎం) మార్చి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ముందు గా కార్యాలయంలో కొనసాగుతున్న పనులపై తహసీల్దార్ లావణ్యను ఆరా తీశారు. మండల పరిషత్, పోలీ్‌సశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన 31 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఉగాది తర్వాత ఇళ్లు నిర్మించుకోవడానికి లబ్ధిదారులు సుముఖంగా ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. మంజూరైన ఇళ్ల లబ్ధిదారులకు ఇసుకకు పర్మిషన్ అవసరం లేదన్నారు. ధరణిలో తప్పుడు రిపోర్టు పంపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో తహసీల్దార్ వి.లావణ్య, డీటీ ష ఫీయొద్దీన్, ఆర్‌ఐలు మల్లికార్జునరావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి
మోత్కూరు మండలకేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుచేయాలని కోరుతూ బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం మోత్కూరు వచ్చిన కలెక్టర్ హనుమంతరావుకు వినతి పత్రం అందజేశారు.
అందుబాటులో డిగ్రీ కళాశాల లేక మోత్కూరు, ఆత్మకూరు(ఎం), గుండాల, అడ్డగూడూరు మండలాల పేద, మద్యతరగతి కుటుంబాల విద్యార్థులు ఇంటర్ విద్యకే పరిమితమై ఉన్నత విద్యకు దూరమవుతున్నారని కలెక్టర్‌కు వివరించారు. మోత్కూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆర్టీసీ బస్సుడిపో ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు నోముల రమేష్, ఎర్రవెల్లి నాగేశ్వర్‌రావు, ఎడ్ల భగవంత్, చిట్టిబాబు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పులు చేయించుకోవాలి
మోత్కూరు: గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రు ల్లో పరీక్షలు చేయించుకుంటూ, ఔషధాలు (మందులు) తీసుకుంటూ కాన్పుకు మాత్రం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి సీజేరియన్ ఆపరేషన్లు చేయించుకుని ఆర్ధికంగా, ఆరోగ్యపరం గా దెబ్బతింటున్నారని కలెక్టర్ హనుమంతరా వు అన్నారు. మంగళవారం మోత్కూరు తహసీల్దార్ కార్యాలయాన్ని, ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఎంపీడీవో, తహసీల్దార్, మునిసిపల్ కమిషనర్‌తో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మండలంలోని పాటిమట్ల గ్రామానికి 45 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, లబ్ధిదారులు సాధ్యమైనంత వేగంగా నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. నిర్మాణాలు జరుగుతుంటే దశలవారీగా బిల్లులు చెల్లిస్తామన్నారు. తహసీల్దార్ డి.రాంప్రసాద్, మునిసిపల్ కమిషనర్ కె.సతీ్‌షకుమార్, ఎంపీడీవో డి.బాలాజీ, పీహెచ్‌సీ వైద్యాధికారులు డాక్టర్ హేమంత్‌కుమార్, డాక్టర్ అమరావతి ఆయన వెంట ఉన్నారు.