Share News

భారీ వర్షం

ABN , Publish Date - Mar 26 , 2025 | 11:24 PM

మండలంలో భారీ వర్షం కురిసింది. బుధవారం మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కుండపోత వర్షం కురిసింది.

భారీ వర్షం
చింతపల్లిలో వర్షం

చింతపల్లి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): మండలంలో భారీ వర్షం కురిసింది. బుధవారం మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కుండపోత వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులన్నీ వాగులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలకు వర్షపు నీరు చేరుకున్నది. వర్షం వల్ల వారపు సంతలో వర్తకులు, వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. ఈ వర్షాలు వ్యవసాయ పనులకు ఉపయోగకరమని ఆర్‌ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు తెలిపారు.

Updated Date - Mar 26 , 2025 | 11:24 PM