ప్రభుత్వం మద్దతు ధరల చట్టం చేయాలి
ABN , Publish Date - Mar 28 , 2025 | 11:58 PM
రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల చట్టం చేయాలని, అన్ని రకాల ధా న్యానికి రాష్ట్ర ప్రభుత్వం బోనస్ చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడి
నల్లగొండ టౌన్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల చట్టం చేయాలని, అన్ని రకాల ధా న్యానికి రాష్ట్ర ప్రభుత్వం బోనస్ చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఖర్చులకు 50శాతం కలిపి మద్దతు ధరలు నిర్ణయించాలన్న ప్రతిపాదనను కేంద్రం తుంగలోకి తొక్కిందన్నారు. మద్దతు ధర కోసం పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు సాగుచేస్తున్న రైతులందరికీ విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి పాలడుగు నాగార్జున, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నారి అయిలయ్య, బండ శ్రీశైలం, సయ్యద్ హాషం, పాలడుగు ప్రభావతి, సిహెచ్.లక్ష్మీనారాయణ, వి.వెంకటేశ్వర్లు, గంజి మురళీదర్, పి.నర్సిరెడ్డి, మల్లం మహేష్, దండెంపల్లి సత్తయ్య, రవి, శశిధర్‌రెడ్డి, వినోద్, శ్రీను, పాల్గొన్నారు.