బోధన, భోజనం ఎలా ఉన్నాయి?
ABN , Publish Date - Mar 25 , 2025 | 11:54 PM
ఉపాధ్యాయు లు పాఠాలు ఏవిధంగా బోధిస్తున్నారు, మధ్యాహ్న భోజనం ఎలా ఉంది, మౌలిక సదుపాయాలు ఉన్నా యా అంటూ విద్యార్థులతో కలెక్టర్ తేజ్‌సనందలాల్ పవార్, ఎస్పీ నర్సింహ ముచ్చటించారు.

విద్యార్థులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, ఎస్పీ
చిలుకూరు, మార్చి 25 (ఆంధ్రజోతి) : ఉపాధ్యాయు లు పాఠాలు ఏవిధంగా బోధిస్తున్నారు, మధ్యాహ్న భోజనం ఎలా ఉంది, మౌలిక సదుపాయాలు ఉన్నా యా అంటూ విద్యార్థులతో కలెక్టర్ తేజ్‌సనందలాల్ పవార్, ఎస్పీ నర్సింహ ముచ్చటించారు. మంగళవారం ఉదయం వారు స్థానిక జిల్లా పరిషత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రార్థన లో పాల్గొని, ప్రతిజ్ఞ చేశారు. విద్యార్ధులు మంచిగా స్పందించడంతో పాఠశాల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుంచే మంచి ప్రవర్తన కలిగి, వ్యసనాలకు దూరంగా ఉంంటూ ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించారు. చిన్నప్పటి నుంచి మెదడును ఎలా ఉపయోగించుకుంటూ పోతే అలాగే తయారవుతారని, అందుకు విద్యార్థులు బాల్యం నుండే సత్ప్రవర్తనతో మెలగాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఎనఎంఎంఎ్‌సలో ప్రతీ ఏడాది జిల్లా ర్యాంక్‌లతో పాటు 10 మంది విద్యార్థులు ఎంపికవుతున్నారని తెలపడంతో కలెక్టర్, ఎస్పీ ఉపాధ్యాయులను అభినందించారు. పాఠశాలకు ప్రార్థన సమయానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు దాదాపుగా అందరూ రావడంతో పాఠశాల నిర్వహణ మంచిగా ఉందని తెలిపారు. పాఠశాలలో మన ఊరు-మన బడి కింద మంజూరైన గదుల నిర్మాణం మధ్యలో నిలిచిపోయిందని, ఉపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో సమస్యకు పరిష్కారం చూపిస్తామన్నారు. కార్యక్రమంలో కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.