Share News

Online Fraud: ఎమ్మార్వోను మోసగించిన కేటుగాడు.. ఏం చేశాడంటే..

ABN , Publish Date - Feb 15 , 2025 | 10:49 AM

Online Fraud: యాదాద్రి జిల్లా రాజాపేట్ తహసీల్దారుగా దామోదర్‌ను ఓ కేటుగాడు మోసం చేశాడు. మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేటుగాడిని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

 Online Fraud: ఎమ్మార్వోను మోసగించిన కేటుగాడు.. ఏం చేశాడంటే..
Online Fraud

యాదాద్రి జిల్లా: పోలీసులు ఎంతగా చైతన్య పరుస్తున్న ఏదో ఒక చోట మోసపోతునే ఉన్నారు. కేటుగాళ్ల చేతిలో పడి రూ.లక్షల్లో తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు. సామాన్యుల నుంచి ప్రభుత్వ అధికారుల వరకు మోసగాళ్ల వలలో చిక్కి నష్టపోతున్నారు. ఇలాంటి వారి పట్ల ఎన్ని చర్యలు తీసుకుంటున్న మళ్లీ మళ్లీ ఏదో ఒక రూపంలో మోసాలకు పాల్పడుతునే ఉన్నారు. తాజాగా యాదాద్రి జిల్లాలో ఓ ఎమ్మార్వోకు ఏసీబీ అధికారిని అంటూ ఓ కేటుగాడు కుచ్చుటోపీ పెట్టాడు. అవినీతికి పాల్పడుతున్నావ్ అంటూ మోసగాడు డబ్బులు డిమాండ్ చేశాడు. అరెస్టు చేయకుండా ఉండాలంటే తాను చెప్పిన ఖాతాలో డబ్బులు వేయాలని బెదిరించాడు. డబ్బులు వేస్తే ఏం పట్టించుకోమని నమ్మబలికాడు. ఎమ్మార్వో భయపడిపోయి కేటుగాడు చెప్పిన ఖాతాల్లో డబ్బులు వేశాడు. సుమారుగా రూ. 3 లక్షల 30 వేలను ఆన్‌లైన్ ద్వారా ఎమ్మార్వో దామోదర్ బదిలీ చేశారు.


యాదాద్రి జిల్లా రాజాపేట్ తహసీల్దారుగా దామోదర్ పనిచేస్తున్నారు. ఈనెల9 తేదీన గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఏసీబీ అధికారులం అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. ఎమ్మార్వో కార్యాలయంలో మరో ఉద్యోగితో కలిసి నువ్వు అవినీతికి పాల్పడినట్లు తమ దగ్గర సమాచారం ఉందని ఫోన్‌లో దామోదర్‌ను బెదిరించాడు. తాను చెప్పినా అకౌంట్‌కు డబ్బులు బదిలీ చేయాలంటూ దామోదర్‌కు దుండగుడు తెలిపాడు. అది నిజమనుకొని రూ.3 లక్షల 30 వేల నగదును ఆన్‌లైన్లో దామోదర్ ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఈ ఘటనపై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు దామోదర్ కుమారుడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు.

Updated Date - Feb 15 , 2025 | 10:49 AM

News Hub