ధాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్
ABN , Publish Date - Mar 25 , 2025 | 11:53 PM
ధార్మిక చింతన, క్రమశిక్ష ణ, ధాతృత్వం కలయికే రంజాన్ మాసమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు.

సూర్యాపేటటౌన, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : ధార్మిక చింతన, క్రమశిక్ష ణ, ధాతృత్వం కలయికే రంజాన్ మాసమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫం క్షనహాల్‌లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన మాట్లాడారు. పేద ముస్లిం ఆడపిల్లల వివాహానికి షాదీముబారక్ పథకం కింద రూ.1.16లక్ష లు అందించిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగని తెలిపారు. మాజీసీఎం కేసీఆర్ మసీద్‌లను నమ్మకొని ప్రార్థనలు చేస్తున్న మౌజన్, పేషీమామ్‌లకు గౌరవ వేతనాలను చెల్లిస్తూ వారిని ఆదుకున్నారని గుర్తు చేశారు. ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ము స్లింల అభివృద్ధికి ఎనలేని కృషి చేసిందన్నారు. ముస్లింల రిజర్వేషన్లు పెం చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనన్నారు. పండుగలు మానవాళి హితాన్ని బోధిస్తాయన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ ఇఫ్తార్ విందుల్లో ఆత్మీయత, సహృద్భావాలు స్పష్టంగా కనిపిస్తాయన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వేణుమాధవ్, తహసీల్దార్ శ్యాం సుందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన రామారావు, నాయకులు చకిలం రాజేశ్వర్‌రావు, అంజద్‌అలీ, మతపెద్దలు, నాయకులు పాల్గొన్నారు.