Share News

DESTROY: పంచాయతీ బోరు, పైపులైన ధ్వంసం

ABN , Publish Date - Mar 27 , 2025 | 12:27 AM

మండల పరిధి లోని పులసల నూ తల గ్రామంలో పంచాయతీ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన బోరు, పైపు లైను, స్టార్టర్లను మంగళవారం రా త్రి గుర్తుతెలి యని వ్యక్తులు ధ్వంసం చేశారు. కొద్దిరోజుల క్రితం గ్రామంలో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది.

DESTROY: పంచాయతీ బోరు, పైపులైన ధ్వంసం
Scene of the destruction of boreholes and pipelines

నార్పల, మార్చి 26(ఆంధ్రజ్యోతి): మండల పరిధి లోని పులసల నూ తల గ్రామంలో పంచాయతీ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన బోరు, పైపు లైను, స్టార్టర్లను మంగళవారం రా త్రి గుర్తుతెలి యని వ్యక్తులు ధ్వంసం చేశారు. కొద్దిరోజుల క్రితం గ్రామంలో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. స్పందించిన పాలకవర్గం, అధికారులు గ్రామంలోని కుంటలో పం చాయతీ ఆధ్వర్యంలో నూతన బోరు వేసి పైప్‌లైనతో పాటు స్టార్టర్లను ఏర్పాటు చేశారు. వాటిని ధ్వంసం చేయడం దారుణ మని ఈ ఘటనపై పంచాయతీ కార్యదర్శి శ్యామల నార్పల పోలీస్‌స్టేషనలో ఫిర్యాదు చేశారు. గ్రామస్థులను ఇబ్బందులకు గురి చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ సాగర్‌ తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 27 , 2025 | 12:27 AM