iftar ఘనంగా ఇఫ్తార్ విందు
ABN , Publish Date - Mar 27 , 2025 | 12:27 AM
రంజాన పర్వదినాన్ని పురష్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బుధవారం రాత్రి స్థానిక గణేష్ కూడలిలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం షాదిమహల్‌లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.

పుట్టపర్తి రూరల్, మార్చి 26(ఆంధ్రజ్యోతి): రంజాన పర్వదినాన్ని పురష్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బుధవారం రాత్రి స్థానిక గణేష్ కూడలిలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం షాదిమహల్‌లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఉపవాసదీక్ష విరమణ అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇందులో జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్, ఎమ్మెల్యే పల్లెసింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, డీఆర్‌ఓ విజయసారధి, ఆర్డీఓ సువర్ణ పాల్గొన్నారు. ముస్లింలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు.