Share News

సెర్ప్‌ లక్ష్యాలను సాధించాలి

ABN , Publish Date - Mar 28 , 2025 | 12:33 AM

ఐకేపీ కేంద్రాలకు పెండింగ్‌ ఉన్న కమీషన్‌ చెల్లించేలా చర్యలు తీసుకొని, సెర్ప్‌ లక్ష్యాలను సాఽధించాలని పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి లోకేష్‌ కుమార్‌ అన్నా రు. నవంబరు వరకు జిల్లా సమాఖ్య భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు.

సెర్ప్‌ లక్ష్యాలను సాధించాలి

జిల్లా సమాఖ్య భవనాలు పూర్తి చేయాలి

ఐకేపీ కేంద్రాల బకాయి చెల్లింపులకు చర్యలు

వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి లోకేష్‌ కుమార్‌

భువనగిరి (కలెక్టరేట్‌), మార్చి 27 (ఆంధ్రజ్యోతి): ఐకేపీ కేంద్రాలకు పెండింగ్‌ ఉన్న కమీషన్‌ చెల్లించేలా చర్యలు తీసుకొని, సెర్ప్‌ లక్ష్యాలను సాఽధించాలని పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి లోకేష్‌ కుమార్‌ అన్నా రు. నవంబరు వరకు జిల్లా సమాఖ్య భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. సెర్ప్‌ కార్యక్రమాల ప్రగతి పనులపై సీఈవో దేవరాజన్‌ దివ్యతో కలిసి గురువారం ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ ఎం.హనుమంతరావు, అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) జీ.వీరారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్‌ కుమార్‌ మాట్లాడుతూ యాసంగి సీజన్‌ మార్కెటింగ్‌కోసం సెర్ప్‌ ఆధ్వర్యంలో ఐకేపీ ధాన్యం కొనుగో లు కేంద్రాలను ప్రస్తుతం 33శాతం ఉన్న కేం ద్రాలను 50శాతానికి పెంచాలన్నారు. ఆసక్తి గ ల మహిళా సంఘాలు రైస్‌ మిల్లుల ఏర్పాటు కు ప్రణాళికలు తయారు చేసి పంపాలన్నారు. పౌర సరఫరాల శాఖ, సెర్ప్‌ సమన్వయంతో భారత ఆహారసంస్థకు బియ్యం సరఫరా చేసే దిశగా కార్యాచరణ రూపొందించాలన్నారు. స్కూల్‌ యూనిఫాం కుట్టేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలలను మహిళా సంఘాలతో ట్యాగింగ్‌ చేసి నిర్ణీత సమయంలో అందేలా చూడాలన్నా రు. మహిళా సంఘాల ద్వారా పెట్రోల్‌ బంకు ఏర్పాటుకోసం ముఖ్యమంత్రి నిర్ణయించారని, ముందస్తుగా జిల్లాస్థాయిలో ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలన్నారు. పెట్రోలు బం కుల తనిఖీలలో లైసెన్సు రద్దు చేసిన వాటిని మహిళా సంఘాలకు కేటాయించాలని, ఇందిరా మహిళా శక్తి బజార్లలో ప్రజలకు అవసరమైన వస్తువులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. మహిళా సంఘాల సభ్యులకు ప్రమాద బీమా, సాధారణ బీమాను ప్రభుత్వం అమలు చేస్తోందని, జిల్లాలో సభ్యుల మరణాలు, బీమా అమలును కలెక్టర్లు పరిశీలించాలన్నారు. దివ్యాంగులకు యూడీఐడీ కార్డుల జారీ ప్రక్రియలో నిర్ధారణ పరీక్షలకు స్లాట్‌ బుకింగ్‌లను కలెక్టర్లు ప్రారంభించాలన్నారు. డీఆర్‌డీవో, ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి, మున్సిపల్‌ కమిషనర్లతో సమావేశం ఏర్పాటు చేసి కుటుంబంలో వృద్ధాప్య పింఛన్‌ పొందుతూ మరణిస్తే భాగస్వామికి వెంటనే పెన్షన్‌ మంజూరు చేయాలన్నారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి టీ.నాగిరెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి వనజాత, జిల్లా విద్యాశాఖాధికారి కే. సత్యనారాయణ, ఏఎ్‌సవో రోజా, జిల్లా గ్రామీణాభివృద్ధి, పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 12:33 AM