ఎల్‌ఆర్‌ఎ్‌సపై ప్రత్యేక దృష్టి సారించాలి
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:36 AM
ప్రభుత్వం లేఅవుట్ క్రమబద్దీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎ్‌స)కు ఇచ్చిన రాయితీని ప్రజలు వినియోగించుకునేలా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ సూచించారు.

గడువులోగా లక్ష్యం సాధించాలి
పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్
భువనగిరి (కలెక్టరేట్), మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం లేఅవుట్ క్రమబద్దీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎ్‌స)కు ఇచ్చిన రాయితీని ప్రజలు వినియోగించుకునేలా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ అమ లు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీపై కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గడువులోగా దరఖాస్తుదారులు ఎల్‌ఆర్‌ఎ్‌సను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
31లోగా క్రమబద్ధీకరించుకోవాలి
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు ప్రభుత్వం కల్పిస్తున్న 25 శాతం రాయితీ పథకాన్ని వినియోగించుకొని ఈ నెల 31లోగా క్రమబద్ధీకరించుకోవాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. అనధికార లేఅవుట్ ప్లాట్లు, అనధికార లేఅవుట్‌లను క్రమబద్ధీకరించేందుకు 2020లో స్వీకరించిన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు 25శాతం రాయితీతో సంబంధిత రుసుం చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జీ.వీరారెడ్డి, ఆర్డీవోలు ఎం.కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.