ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులకు శుభవార్త
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:45 AM
ఎల్‌ఆర్‌ఎస్ 25శాతం ఫీజు రాయితీ గడువును ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు పొడగించినట్లు కలెక్టర్ ఎం.హనుమంతరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియో గం చేసుకొని గడువులోగా రాయితీతో ఫీజు చెల్లించి ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని సూ చించారు.

25శాతం ఫీజు రాయితీ గడువు పొడగింపు
ఈ నెల 30 వరకు అవకాశం 8 రూ.10.20కోట్ల ఫీజు
భువనగిరి టౌన్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): ఎల్‌ఆర్‌ఎస్ 25శాతం ఫీజు రాయితీ గడువును ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు పొడగించినట్లు కలెక్టర్ ఎం.హనుమంతరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియో గం చేసుకొని గడువులోగా రాయితీతో ఫీజు చెల్లించి ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని సూ చించారు. కాగా, భువనగిరి మునిసిపాలిటీ పరిధిలో మార్చి 31 వరకు 1,527 ప్లాట్ల క్రమబద్ధీకరణ పూర్తి కాగా, ప్రభుత్వానికి ఫీజు రూపంలో రూ.10.20కోట్ల ఆదాయం లభించింది. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగిన రిజిస్ట్రేషన్ల్ ద్వారా మరిన్ని ప్లాట్ల క్రమబద్ధీకరణ జరగ్గా స్టాంప్ డ్యూటీ, ఎల్‌ఆర్‌ఎస్ ఫీజుతో ప్రభుత్వానికి మరింత ఆదాయం లభించింది. 2020 ఆగస్టు 26 గడువులోపు భువనగిరి మునిసిపాలిటీలో 15,553 మంది యజమానులు ఎల్‌ఆర్‌ఎ్‌సకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు సుమారు నాలుగున్నర సంవత్సరాల అనంతరం ప్రభుత్వ నిర్ణయంతో మార్చి 31 లోపు కేవలం 10 శాతం ప్లాట్ల క్రమబద్ధీకరణ పూర్తి కాగా,ఫీజు రూపం లో ప్రభుత్వానికి రూ.10.20కోట్ల ఆదాయం లభించింది. ఇదే తరహా పరిస్థితి జిల్లా అంతటా ఉంది. దరఖాస్తు చేసుకున్న అన్ని ప్లాట్ల క్రమబద్ధీకరణ పూర్తయితే ప్రభుత్వానికి జిల్లా నుంచి వందల కోట్ల రూపాయల ఆదాయం లభించే అవకాశం ఉంది. అయితే ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా వచ్చిన ఫీజులను ప్రభుత్వం స్థానిక అభివృద్ధికే వినియోగించాలని ప్రజలు కోరుతున్నారు.