Share News

రైతులపై ప్రకృతి కన్నెర్ర....

ABN , Publish Date - Mar 23 , 2025 | 11:13 PM

ప్రకృతి వై పరీత్యం కారణంగా అన్నదాతకు ఎనలేని నష్టం వా టిల్లింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో పెద్ద మొత్తంలో పంట నీటి పాలుకావడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో ఆంధోళకు గురవుతున్నారు.

రైతులపై ప్రకృతి కన్నెర్ర....

-అకాల వర్షంతో నీటిపాలైన పంటలు

-జిల్లాలో నీటిపాలైన 255 ఎకరాలు

-ప్రాథమిక నష్టం అంచనా వేసిన అధికారులు

-ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపు

మంచిర్యాల, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి వై పరీత్యం కారణంగా అన్నదాతకు ఎనలేని నష్టం వా టిల్లింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో పెద్ద మొత్తంలో పంట నీటి పాలుకావడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో ఆంధోళకు గురవుతున్నారు. వే లకు వేలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంట మొలక దశలోనే నీట మునగడంతో క నీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితులు నెలకొ న్నాయి. ముఖ్యంగా వరి, మొక్కజొన్న పంటలకు భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది.

పంట నీళ్లపాలు...

భారీ వర్షాల కారణంగా జిల్లాలోని పలు మండ లాల్లో ప్రధానంగా 113 మందికి రైతులకు చెందిన ప త్తి, వరిపంటలు 255 ఎకరాల్లో నీట మునిగినట్లు వ్య వసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా కు వచ్చారు. వ్యవసాయశాఖ అధికారుల అంచనా ప్రకారం...దండేపల్లి మండలంలోని ఏడు గ్రామాల్లో 37 మంది రైతులకు చెందిన 91 ఎకరాల్లో మొక్క జొన్న పంట నేలకొరగా, ఖానాపూర్‌ నియోజక వర్గం లోని జన్నారం మండలంలో ఏడు గ్రామాల్లోని 42 మంది రైతులకు చెందిన మొత్తం 92 ఎకరాల్లో పం టలకు నష్టం వాటిల్లింది. అలాగే హాజీపూర్‌ మండ లంలోని ఆరు గ్రామాల్లో 45 మందికి చెందిన 80 ఎ కరాల్లో కోతకు వచ్చిన వరి పంట పూర్తిగా నీటిపా లైంది. మండలంలోని 26 మంది రైతులకు చెందిన 77 ఎకరాల్లో మొక్కజొన్న పూర్తిగా నేలకొరిగింది. అ కాల వర్షం కారణంగా జిల్లాలోని ఆయా మండలాల్లో సుమారు రూ. 25 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా.

లక్షలు వెచ్చించి సాగు..

అకాల వర్షం కారణంగా జిల్లాలోని మొక్కజొన్న, వరి, ఇతర పంటలు సాగు చేసిన రైతన్నలకు తీరని నష్టం వాటిల్లింది. పంట సాగు సమయంలో ఎకరా కు రూ. 40 వెచ్చించినట్లు రైతులు తెలిపారు. భూ ములు దున్నడం మొదలుకొని విత్తనాలు వేయడం ఎరువులు, కలుపు తీయడం, కూలీలకు లక్షలు వె చ్చించినట్లు చెబుతున్నారు. వరి కోతకు వచ్చిన సమ యంలో వర్షాలకు పంట మొత్తం నీటిపాలు కావడం తో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట మొ త్తం తుడిచి పెట్టుకుపోవడంతో రెక్కల కష్టం కూడా మిగలక పోగా, సాగు కోసం చేసిన అప్పు ఎలా తీ ర్చాలో తెలియక తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు.

నష్టం అంచనా పనిలో అధికారులు....

అకాల వర్షం కారణంగా వివిధ రకాల పంటలకు జరిగిన నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేసిన అధి కారులు, పూర్తిస్థాయి నష్టం అంచనా రూపొం దించి, తుది నివేధిక తయారు చేసిన పనిలో నిమగ్నమ య్యారు. క్షేత్రస్థాయిలో.. పంట చేలను సందర్శించి ఏ మేరకు దెబ్బతిన్నాయో పరిశీలిస్తున్నారు. నష్టం అం చనా పూర్తికాగానే సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయన్నుట్లు తెలిపారు.

ప్రభుత్వంపైనే అన్నదాతల ఆశలు...

కోతదశలో ఉన్న పంటలు చేతికి రానుండటంతో ఆనందంతో ఉన్న రైతులకు ఊహించని విధంగా న ష్టం వాటిళ్లడంతో ప్రభుత్వంపైనే భారం వేస్తున్నారు. అకాల వర్షం కారణంగా నష్టపోయిన పంటలకు ఎ కరాకు రూ. 10వేలు పరిహారం చెల్లించడం ద్వారా ఆ దుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా రు. ప్రభుత్వం నష్టపరిహారం అందజేస్తే కనీసం పె ట్టుబడులు తిరిగొస్తాయన్న ఆశతో ఉన్నారు. సంబం ధిత అధికారులు జరిగిన నష్టాన్ని త్వరగా అంచనా వేసి, ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.

Updated Date - Mar 23 , 2025 | 11:13 PM