Manda Krishna: పద్మశ్రీ.. మాదిగ జాతికి అంకితం
ABN , Publish Date - Jan 26 , 2025 | 03:43 AM
శనివారం రాత్రి నిజామాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, కిషన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

నా సామాజిక సేవను కేంద్రం గుర్తించింది: మందకృష్ణ
సుభా్‌షనగర్ (నిజామాబాద్)/సిద్దిపేట అర్బన్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): పద్మశ్రీ అవార్డును మాదిగ జాతికి అంకితం చేస్తున్నానని మందకృష్ణ తెలిపారు. శనివారం రాత్రి నిజామాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, కిషన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తన 30 ఏళ్ల పోరాటంలో ప్రభుత్వాలతో కొట్లాడి ఆరోగ్యశ్రీతో పాటు వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు సాధించానని చెప్పారు. తన సేవను గుర్తించి అవార్డు ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఎస్సీ వర్గీకరణకు అనుకూలమే అయినా ఆయన మాలల కబంధహస్తాల్లో బంధించబడ్డారన్నారు. వర్గీకరణకు వెంకటస్వామి, మల్లు కుటుంబాలు అడ్డుపడుతున్నాయన్నారు. మాదిగలు, ఉపకులాలు ఫిబ్రవరి 7న హైదరాబాద్‌లో ‘వేల గొంతుకలు.. లక్ష డప్పులు’ కార్యక్రమానికి తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి:
క్రికెట్ చరిత్రలో సంచలనం.. 73 ఏళ్ల ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
రంజీ ట్రోఫీ.. రోహిత్ టీమ్ ఘోర ఓటమి
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి