Share News

Sri Rama Navami: దుబాయ్‌లో వైభవోపేతంగా శ్రీరామనవమి వేడుకలు

ABN , Publish Date - Apr 07 , 2025 | 04:12 AM

దుబాయ్‌లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆజ్మాన్‌లో జరిగిన సీతారాముల కల్యాణోత్సవంలో పెద్ద సంఖ్యలో భారతీయులు పాల్గొన్నారు.

Sri Rama Navami: దుబాయ్‌లో వైభవోపేతంగా శ్రీరామనవమి వేడుకలు

యూఏఈ, ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి, ఏప్రిల్‌6: దుబాయ్‌లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆజ్మాన్‌లో జరిగిన సీతారాముల కల్యాణోత్సవంలో పెద్ద సంఖ్యలో భారతీయులు పాల్గొన్నారు. తెలంగాణ భక్తి బృందం అధ్వర్యంలో గణపతి పూజ, హనుమాన్‌ చాలీసా పఠనం సాగాయి. స్థానిక వేద పండితుడు సతీష్‌ బృందం ఆధ్వర్యంలో తెలుగు వారు కుటుంబసమేతంగా రామాయణం పారాయణం చేశారని తెలంగాణ ప్రవాసీలు గాజా నవినీత్‌, వంశీగౌడ్‌ తెలిపారు. వేడుకల ఏర్పాట్లను ఆరే శరత్‌, కృష్ణా మేగి, మదన్‌ మోదన్‌, జగదీశ్‌ సమన్వయం చేశారు.

Updated Date - Apr 07 , 2025 | 04:12 AM