Share News

కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలు

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:46 AM

కేంద్రప్రభుత్వం అనుసరించే కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భవన నిర్మాణ కార్మికుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్నామని ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పల్లా దేవేందర్‌రెడ్డి అన్నారు.

కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలు
సమావేశంలో మాట్లాడుతున్న ఏఐటీయూసీ నాయకుడు పల్లా దేవేందర్‌రెడ్డి

మునుగోడు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): కేంద్రప్రభుత్వం అనుసరించే కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భవన నిర్మాణ కార్మికుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్నామని ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పల్లా దేవేందర్‌రెడ్డి అన్నారు. మునుగోడులో సోమవారం జరిగిన ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మికుల సంక్షేమ బోర్డు సమస్యలకు నిలయంగా మారిందన్నారు. దీంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ బోర్డులో కార్మికులకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు వ్యతిరేకంగా కొత్తగా తీసుకొచ్చిన చట్టాలను తిప్పికొట్టేందుకు పోరాటాలు తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. సభ ప్రారంభానికి ముందు కార్మిక .జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు చాపల శ్రీను, కార్యదర్శులు దుబ్బ వెంకన్న, బెల్లం శివయ్య. ఈద యాదయ్య, నర్సింహ, కృష్ణయ్య, రాములు, శ్రీను, మా రయ్య, నాగేష్‌, వెంకన్న, గిరి, స్వామి, శంకర్‌, నర్సింహ పాల్గొన్నారు.

Updated Date - Mar 25 , 2025 | 12:46 AM