Share News

ఈ నెల 26 నుంచి మరో 4 పథకాలు

ABN , Publish Date - Jan 13 , 2025 | 04:35 AM

రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తేదీ నుంచి 4 పథకాలను ప్రారంభించనుందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ ల మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు.

ఈ నెల 26 నుంచి మరో 4 పథకాలు

  • 16 నుంచి గ్రామ సభలు: పొంగులేటి

హనుమకొండ టౌన్‌/హనుమకొండ కలెక్టరేట్‌, ఖమ్మం ప్రతినిధి, జనవరి12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తేదీ నుంచి 4 పథకాలను ప్రారంభించనుందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ ల మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. అధికారులు ఈ నెల 16 నుంచి గ్రామాలకు వెళ్లి పారదర్శకంగా అర్హులను ఎంపిక చేసి సంక్షేమ పథకాలు అందేలా చూ డాలన్నారు. ఆదివారం హనుమకొండ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డుల జారీ వంటి సంక్షేమ పథకాల అమలుపై మంత్రి పొంగులేటి ఉమ్మడి వరంగల్‌ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉగాది నుంచి రేషన్‌ కార్డుల ద్వారా సన్నబియ్యం ఇవ్వటానికి సన్నద్ధం చేస్తున్నట్లు పొంగులేటి తెలిపారు. భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు రెండు విడతలుగా రూ.12వేలు అందజేస్తామన్నారు.


పొంగులేటికి తప్పిన ప్రమాదం

వరంగల్‌లో సమీక్ష అనంతరం ఖమ్మం తిరిగి వెళ్తుండగా పొంగులేటి కారుకు ప్రమాదం వాటిల్లింది. రాత్రి 8.45గంటల సమయంలో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం-చింతపల్లి గ్రామాల మధ్యలో ఆయన ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు పేలాయి. డ్రైవర్‌ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. అనంతరం మంత్రి తన అనుచరులు, పోలీస్‌ ఎస్కార్ట్‌ వాహనంలో ఖమ్మంలోని తన నివాసానికి చేరుకున్నారు.

Updated Date - Jan 13 , 2025 | 04:35 AM