Share News

ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం...

ABN , Publish Date - Mar 23 , 2025 | 11:08 PM

నియోజక వర్గ ప్రజలకు ప్రతి సంవత్సరం సేవ కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌ సాగర్‌ రావు అన్నారు. నస్పూర్‌ పట్టణం తీగల్‌ పహాడ్‌లోని ఏవి ఫంక్షన్‌ హాల్‌లో ఆది వారం రఘుపతి రావు చారిట్రబుల్‌ ట్రస్టు ద్వారా ముస్లిం సోదరి మణులకు రంజాన్‌ తోఫాను డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురే ఖతో కలిసి పంపిణీ చేశారు.

ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం...
నస్పూర్‌లో రంజాన్‌ తోఫాను అందిస్తున్న ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్‌ రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ

తోఫా పంపిణీలో ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్‌ రావు

నస్పూర్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : నియోజక వర్గ ప్రజలకు ప్రతి సంవత్సరం సేవ కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌ సాగర్‌ రావు అన్నారు. నస్పూర్‌ పట్టణం తీగల్‌ పహాడ్‌లోని ఏవి ఫంక్షన్‌ హాల్‌లో ఆది వారం రఘుపతి రావు చారిట్రబుల్‌ ట్రస్టు ద్వారా ముస్లిం సోదరి మణులకు రంజాన్‌ తోఫాను డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురే ఖతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ఎన్నికలకు సంబంధం లేకుండా ప్రతి ఏటా రంజాన్‌ పండు గకు తోఫా ఇస్తున్నమన్నారు. పేద కుటుంబాలకు చేయూతని స్తూ రంజాన్‌ పండగను వారు ఆనందంగా జరుపుకోవడానికి త మవంతు సహాకారం అందిస్తున్నమన్నారు. ప్రభుత్వం ఉగాది నుంచి తెల్ల కార్డు దారులకు సన్న బియ్యం సరఫరా చేస్తుంద న్నారు. కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులు చేసిన వారికి ఏ ప్రిల్‌ లేదా మే 15 లోపల కొత్త కార్డులు వస్తాయన్నారు. ఇంది రమ్మ ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని, వచ్చే నాలుగేళ్లలో అ ర్హులైనవారందరికి ఇళ్లను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ సుర్మిళ్ల వేణు, నాయకులు గెల్లు రజిత, సంధ్యారాణి, పూదరి కుమార్‌, విజయ్‌ కుమార్‌, సంపత్‌ రెడ్డి, పద్మ, కలీద్‌, చక్రి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 11:08 PM