Share News

CM MK Stalin : చెన్నైలో చర్చించింది హైదరాబాద్‌లో నెరవేరింది

ABN , Publish Date - Mar 27 , 2025 | 09:51 PM

CM MK Stalin : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా డిలిమిటేషన్‌పై రేవంత్ సర్కార్ తీర్మానం చేసింది. దీనిపై తమిళనాడు సీఎం, డీఏంకే అధినేత ఏంకే స్టాలిన్ స్పందించారు. తన ఎక్స్ ఖాతా వేదికగా ఆయన స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.

CM MK Stalin : చెన్నైలో చర్చించింది హైదరాబాద్‌లో నెరవేరింది
TN CM Stalin With TG CM Revanth

చెన్నై, మార్చి 27: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా డిలిమిటేషన్‌పై రేవంత్ రెడ్డి సర్కార్ తీర్మానం చేసింది. ఈ వ్యవహారం పై తమిళనాడు ముఖ్యమంత్రి, డీఏంకే అధ్యక్షుడు ఏం కే స్టాలిన్ తన ఎక్స్ ఖాతా వేదికగా గురువారం స్పందించారు. చెన్నైలో చర్చించింది.. హైదరాబాద్‌లో నెరవేరిందన్నారు. న్యాయబద్దమైన డిలిమిటేషన్‌పై తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేయడం సమాఖ్య స్ఫూర్తిని చాటిందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఈ తీర్మానం ఒక మైలు రాయి అని ఆయన అభివర్ణించారు.

ఈ తీర్మానం ప్రజాస్వామ్య సమతుల్యతను బెదిరించే ఏ ప్రయత్నాన్నైనా ప్రతిఘటించాలనే సమిష్టి పిలుపును బలపరుస్తుందని స్పష్టం చేశారు. ఇది ప్రారంభం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ రెండో సమావేశానికి హైదరాబాద్ వేదిక కానుందని ఆయన గుర్తు చేశారు. దేశ భవిష్యత్తును అన్యాయంగా తిరిగి రాయడాన్ని మేము అంగీకరించామని సీఎం ఏం కే స్టాలిన్ పునరుద్ఘాటించారు.


డిలిమిటేషన్‌పై కేంద్రం వ్యూహాత్మకంగా పావులు కదుపుతొంది. అందులోభాగంగా జనాభా ప్రాతిపదికన లోక్ సభ సీట్లు ఏర్పాటుకానున్నాయని తమిళనాడు సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. వీటి వల్ల తమిళనాడులోని మొత్తం 39 లోక్ సభ స్థానాలకు డిలిమిటేషన్ అనంతరం కేవలం 31 స్థానాలకు పరిమితం అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆ క్రమంలో చెన్నై వేదికగా అఖిలపక్షం ఏర్పాటు చేశారు. అలాగే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నేతతో చెన్నై వేదికగా సమావేశం ఏర్పాటు చేశారు.


ఈ సమావేశాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఆయన కేబినెట్‌లోని పలువురు సహచరులు పాల్గొన్నారు. అదే విధంగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తోపాటు ఆ పార్టీ సీనియర్ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా డిలిమిటేషన్‌పై తెలంగాణ నేతలు తమదైన శైలిలో తమ వాణిని వినిపించారు. ఇక తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో డిలిమిటేషన్‌పై తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో డీఏంకే అధినేత, సీఎం స్టాలిన్ పై విధంగా స్పందించారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Amith Shah: బిల్లు అమోదం వేళ.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

Stuff Chicken: మందు తాగేటప్పుడు.. చికెన్ తింటే ఏమవుతోంది

Top Secret: చనిపోయే ముందు శరీరంలో మొదట ఆగిపోయే అవయవం ఏదింటే..

Iftar Party: ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

KTR: అలా అయితే రాజకీయాలకు గుడ్ బై

Night Food: రాత్రుళ్లు ఈ ఆహారం తీసుకోండి.. షుగర్ రమ్మనా రాదు..

Curd Rice:పెరుగన్నం తింటే లాభమా నష్టమా.. ఎందుకు తినాలి

Milk: పాలు తాగిన వెంటనే ఇవి తీసుకోంటే.. డేంజర్

LRS : ఎల్ఎస్ఆర్‌ లీల.. రూ. 14 లక్షల భూమికి రూ. 28 కోట్ల ఎల్ఆర్ఎస్ ఛార్జెస్..

ఈ పువ్వుతో ఇన్ని లాభాలున్నాయా..?

For Telangana News And Telugu News

Updated Date - Mar 27 , 2025 | 09:52 PM