Share News

Congress: తెలంగాణ పర్యటనకు కాంగ్రెస్ అగ్రనేత..

ABN , Publish Date - Feb 11 , 2025 | 11:18 AM

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మంగళవారం తెలంగాణకు రానున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన వరంగల్‌లో పర్యటించనున్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై రాహుల్ గాంధీ ప్రజల రియాక్షన్ తెలుసుకోనున్నారు. అలాగే రైల్వే ప్రయివేటీకరణ అంశంపై రైలు ప్రయాణికుల నుండి ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నారు.

Congress: తెలంగాణ పర్యటనకు కాంగ్రెస్ అగ్రనేత..
Rahul Gandhi..

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మంగళవారం తెలంగాణ (Telangana)లోని వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు (Shamshabad Airport) చేరుకుని.. అక్కడి నుంచి చాపర్‌లో వరంగల్ (Warangal) చేరుకుంటారు. అక్కడ పర్యటన ముగించుకున్న అనంతరం పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. తర్వాత రాత్రి 7:30 గంటలకు అక్కడి నుంచి రైలులో చెన్నై (Chennai)కు బయలుదేరి వెళతారు. వరంగల్‌లో ప్రైవేటు కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.

ఈ వార్త కూడా చదవండి..

కాంగ్రెస్ నెక్ట్స్ టార్గెట్ ఎవరంటే..


బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై రాహుల్ గాంధీ ప్రజల రియాక్షన్ తెలుసుకొనున్నారు. అలాగే రైల్వే ప్రయివేటీకరణ అంశంపై రైలు ప్రయాణికుల నుండి ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నారు. ఈ సందర్భంగా ట్రైన్‌లో విద్యార్థులతో రాహుల్ ప్రోగ్రాం నిర్వహిస్తారు. కాగా ఏఐసీసీ అగ్రనేత ఆకస్మిక పర్యటన(Surprise Visit) తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కాగా రాహుల్ రాష్ట్ర పర్యటన నేపధ్యంలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీపీ కమిటీ నిర్మాణంకు సంబంధించి ఏమైనా సంకేతాలు వెలువడుతాయా అన్నదానిపై పార్టీ వర్గాలు దృష్టి సారించాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

4 దశాబ్దాల తర్వాత గ్రామస్థులంతా కలిసి భోజనాలు

ఆ యాక్టు మార్చే ఆలోచన లేదు

ఏపీ మంత్రుల నెత్తిన ర్యాంకుల పిడుగు

మంత్రి పయ్యావుల ప్రీ-బడ్జెటరీ సమావేశాలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 11 , 2025 | 11:18 AM