Share News

మందమర్రిలో ఫాంఆయిల్‌ ఫ్యాక్టరీ ఏమైంది...

ABN , Publish Date - Mar 23 , 2025 | 11:10 PM

నియోజకవర్గంలోని మందమర్రిలో రూ. 500 కోట్లతో గత ప్రభుత్వం ఫాంఆయిల్‌ ఫ్యాక్టరీకి శంకుస్ధాపన చే సిందని, ఇది ప్రస్తుతం ఏమైందో ఎవరికి తెలియదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ ధ్వజమెత్తారు.

మందమర్రిలో ఫాంఆయిల్‌ ఫ్యాక్టరీ ఏమైంది...
మందమర్రిలో ఫాంఆయిల్‌ ఫ్యాక్టరీ ఏమైంది...

మందమర్రి మున్సిపాలీటీకి ఎన్నికల హామీ ఏమైంది

-బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌

మందమర్రిటౌన్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గంలోని మందమర్రిలో రూ. 500 కోట్లతో గత ప్రభుత్వం ఫాంఆయిల్‌ ఫ్యాక్టరీకి శంకుస్ధాపన చే సిందని, ఇది ప్రస్తుతం ఏమైందో ఎవరికి తెలియదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ ధ్వజమెత్తారు. ఆదివారం మందమర్రి ప్రెస్‌క్లబ్‌లో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కా వస్తున్నా ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు కాలేదన్నారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా తదితర హామీలు అటకె క్కాయన్నారు. మందమర్రి ఫాంఆయిల్‌ ఫ్యాక్టరీ ఏర్పా టు కానుందనే నమ్మకంతో జిల్లాలో ఫాంఆయిల్‌ పం టలను సాగు చేసుకున్నారని ఇప్పుడు దిగుబడి సా ధించి కోతకు వచ్చిన సమయంలో ఇక్కడ ఫాంఆయి ల్‌ ఫ్యాక్టరీ లేకుండా పోయిందని, దీంతో రైతులు ఆం దోళన చెందుతున్నారన్నారు. గత ప్రభుత్వ హయాం లో చెన్నూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులను ప్రారంభించారని, ఆ పనులను ప్రస్తుత ప్రభుత్వం , ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవడం లేదో చెప్పాలన్నారు. ఇది ప్రజాధనం వృధా చేయడం కా దా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు మందమర్రి లో తోళ్ల పరిశ్రమను ప్రారంభిస్తామని చెప్పారని, మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిపిస్తామని చెప్పి ఇప్పటి వరకు చేయలేదని పేర్కొన్నారు. వెంట నే ఈ సమస్యలను పరిష్కరించాలని లేకుంటే ప్రజ లను కలుపుకుని పోరాటాలు చేస్తామన్నారు. ప్రజల కోసం పనిచేసే పార్టీ ఒక్క బీజేపీ అని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు ఆరుముళ్ల పోశం, దుర్గం అశోక్‌, దేవరనేని సంజీవరావు, కుమారస్వామి, మోహన్‌, రాయమల్లు, నరేష్‌, శివ ప్రసాద్‌, రమేష్‌, దుర్గరాజ్‌, శ్రీనివాస్‌, వినయ్‌, తిరుపతి, రాజు, శ్రీని వాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 11:10 PM