ఢిల్లీ బాట పట్టిన అఖిలపక్షం నేతలు..
ABN, Publish Date - Apr 01 , 2025 | 09:35 AM
తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలో బుధవారం మహాధర్నా నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, బీఎస్పీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తదితర పార్టీల నేతలు ధర్నాలో పాల్గొననున్నారు.
న్యూఢిల్లీ: బీసీ (BC)ల పోరు గర్జన సభ బుధవారం ఢిల్లీ (Delhi)లో జరగనుంది. స్థానిక ఎన్నికలు, విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ (Reservation) కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) ఆమోదించిన రెండు బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో మహా ధర్నా (Maha Dharna) చేపట్టనున్నారు. ఈ ధర్నాలో పాల్గొనేందుకు తెలంగాణలోని అఖిలపక్ష పార్టీల నేతలు (Akhilapaksham Leaders) ఢిల్లీ బాట పట్టారు.
Also Read..: తెలుగు రాష్ట్రాల్లో క్రైమ్.. కలకలం రేపిన గ్యాంగ్ వార్
మహాధర్నాకు రావాలంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లీస్, వామపక్షాలు, టీజేఎస్‌తోపాటు బీజేపీ నేతలను బీసీ సంఘాల ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు ధర్నాలో పాల్గొనేందుకు అఖిలపక్ష పార్టీల నాయకులు ఢిల్లీకి వెళుతున్నారు. అధికార కాంగ్రెస్ నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖా, బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు హజరుకానున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రియుడిఫై కోపంతో ఆ మహిళ ఏంచేసిందంటే..
ఎస్ఆర్‌హెచ్ వివాదంపై స్పందించిన హెచ్‌సీఏ
For More AP News and Telugu News
Updated at - Apr 01 , 2025 | 09:35 AM