Yashwant Verma FIR Case: ఎఫ్‌ఐఆర్‌కు నో చెప్పిన సుప్రీం
ABN, Publish Date - Mar 28 , 2025 | 03:36 PM
Yashwant Verma FIR Case: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిపై ఎఫ్‌ఐఆర్‌కు సుప్రీం కోర్టు నో చెప్పేసింది. అంతర్గత కమిటీ పరిశీలిస్తున్నందున పిటిషన్‌ను విచారణకు తీసుకోలేమని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది.
న్యూఢిల్లీ, మార్చి 28: జస్టిస్ యశ్వంత్ వర్మపై (Justice Yashwant Verma) ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలన్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు (Supreme Court) తిరస్కరించింది. సీజేఐ ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీ పరిశీలిస్తున్నందున పిటిషన్‌ను విచారణకు తీసుకోలేమని సుప్రీం స్పష్టం చేసింది. కాగా.. మార్చి 14న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో భారీ నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఈ సంఘటనకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం.. విచారణకు తీసుకునేందుకు నిరాకరించింది.
సీజేఐ సంజీవ్ ఖన్నా ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీ విచారణ ఇప్పటికే పరిశీలిస్తున్నందున.. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తప్పులు ఉన్నాయని తేలితే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని అభిప్రాయపడింది. అంతర్గత కమిటీ సూచిస్తే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయొచ్చని.. ఇప్పుడే తొందరపాటు చర్యలు మంచిదికాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి...
Youth Firing Gun: అర్ధరాత్రి కారులో వెళ్తూ ఆ యువకులు చేసిన పని తెలిస్తే
Young Man Killed: పుట్టినరోజు నాడే కిరాతకం.. యువకుడి దారుణ హత్య
Read Latest National News And Telugu News
Updated at - Mar 28 , 2025 | 03:37 PM