Home » Andhra Pradesh » West Godavari
సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో శనివారం జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. సీఎం రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు.
ఏళ్ల తరబడి రైతులు ఎదురు చూసిన సాగునీటి సంఘాలకు నేడు ఎన్నికలు జరగబోతున్నాయి.
సంక్రాంతి సీజన్ ద్వారా ఆర్టీసీ హైదరాబాద్ నుంచి జిల్లాకు ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో కొద్ది రోజుల క్రితం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి రెండు గంటల పాటు పరిశీలించారు.
ఏటిగట్టు ప్రాంతంలోని కంపోస్టుయార్డును పరిశీ లించిన ప్రత్యేక బృందం దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది.
వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగించు కుని పంచాయతీలు బలోపేతం కావాలని ఏపీ గ్రామీణాభివృద్ధి సంస్థ జేడీ రమణ అన్నారు.
రెవెన్యూ సదస్సుల్లో భాగంగా వచ్చిన వినతులపై తక్షణ చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని తహసీల్దార్ గెడ్డం ఎలీషా అన్నారు.
చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న కొవ్వూరు–భద్రాచలం రైల్వే లైనుకు కేంద్రం తగినంత బడ్జెట్ కేటాయిం చింది. చిన్న మార్పులతోనే ఈ మార్గం పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటి వరకు సర్వేల పేరిట జరిగిన కాలయాపనకు స్వస్తి పలికింది. వచ్చే ఐదేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించింది. భారీ అంచనా వ్యయంతో ప్రాజెక్టు మంజూరు చేస్తున్నట్టుగా రైల్వే మంత్రి రాజమహేం ద్రవరం ఎంపీ పురందేశ్వరికి రాత పూర్వకంగా తెలపడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ప.గో. జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సైతం ఫ్యాన్ పార్టీకి రాజీమానా చేశారు. వైసీపీ సభ్యత్వానికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు లేఖను అధిష్ఠానానికి పంపించారు.
ఉంగుటూరుకు చెందిన విశ్రాంత ఉమ్మడి ఏపీ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుంకవల్లి పర్వతరావు (90) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు.