Home » Adilabad
జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాల అమలు లక్ష్యాలను పూర్తి చేయాలని డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్ సూచించారు. శుక్రవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో వైద్యులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయని, వాటి వివరాలను రెండు రోజుల్లో తెలియజేయాలని సూచించారు.
జిల్లాలో రెండు రోజులుగా చలి విజృంభిస్తోంది. మూడు రోజుల నుంచి క్రమేపీ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో మరింతగా చలి పెరుగుతుండటంతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతు న్నారు. ముఖ్యంగా రాత్రుళ్లు ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.
నెన్నెల-కోనం పేట రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు ఉన్న ప్పటికీ అధికారులు పనులు నిలిపి వేయడంపై కోనం పేట గ్రామస్థులు మండిపడ్డారు. కుంటిసాకులతో రోడ్డు పనులకు అడ్డు చెప్పొద్దంటూ నెన్నెల రేంజ్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నాకు దిగారు.
ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో అర్హులను గుర్తిం చాలని హౌజింగ్ డీఈ మునీందర్ అన్నారు. గురువారం ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరి శీలించి మాట్లాడుతూ సర్వేను పారదర్శకంగా నిర్వహించి అర్హులను ఎంపిక చేయాలన్నారు.
డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాల జాబితాపై అభ్యంతరాలుంటే తెలియజేయాలని ఎంపీడీవో సత్యనారా యణసింగ్ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రానున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రాల జాబితాను విడుదల చేశామన్నారు.
నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సమస్యలను కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి, సబ్ కమిటీ దృష్టికి తీసుకువెళ్తామని కేంద్ర సంఘం సలహాదారు సంద అశోక్ తెలిపారు. గురువారం జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో ఐటీఐ కార్యాలయంలో చేపట్టిన సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు.
రేషన్ డీలర్లు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. పాలకులకు ఏళ్ల తరబడి మొర పెట్టుకుంటున్నా మోక్షం లభించడం లేదు. నెల రోజులు శ్రమ పడితే చివరకు మిగిలేదనే అభిప్రాయాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సమస్యలు తీరుతాయని గంపెడు ఆశలు పెట్టుకున్న డీలర్లకు నిరాశే ఎదురైంది.
అకాల వర్షాలతో తడిసిన ధాన్యం, పత్తికి మద్దతు ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. నెన్నెల రైతులతో సోమవారం మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ మాట్లాడారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని, పత్తిని పరిశీలించారు.
నస్పూర్‌లోని కలెక్టరేట్ ఎదుట తెలంగాణ సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సంఘం (ఎస్ఎస్ఏ-జెఏసీ) ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష సోమవారం ముగిసింది. ప్రభుత్వం నుంచి సానుకూలత రాకపోవడంతో మంగళవారం నుంచి సమ్మెలోకి వెళ్ళాలని నిర్ణయించారు.
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సోమ వారం మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత మాట్లా డుతూ వార్డులను నిత్యం పరిశుభ్రంగా ఉంచు తూ ప్రజల ఆరోగ్యాలను రక్షించే కార్మికులు ఆరోగ్యంగా ఉండేందుకు ఎమ్మెల్యే వినోద్ ఆదే శాల మేరకు వైద్యపరీక్షలు చేయించినట్లు తెలిపారు.