Share News

Araku Utsav: అరకు ఉత్సవ్ కోసం.. భారీగా నిధుల విడుదల

ABN , Publish Date - Jan 28 , 2025 | 07:37 PM

Araku Utsav: జనవరి 31 నుంచి 3 రోజులపాటు అరకులో చలి పండుగ జరుగనుంది. దీనికి సంబంధించి చలి ఉత్సవం పేరుతో ఏపీ ప్రభుత్వం పోస్టర్లు విడుదల చేసింది. ఈ పండుగ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

Araku Utsav: అరకు ఉత్సవ్ కోసం..  భారీగా నిధుల విడుదల
Araku Utsav

అమరావతి: అరకు వెళ్లే పర్యాటకులకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చలికాలంలో మంచు దుప్పటి కప్పుకున్న ప్రకృతి అందాలను చూడటానికి పర్యాటకులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. శీతాకాలంలో అరకు లోయ అందాలు కనువిందు చూస్తుంటాయి. అయితే వీటిని చూసి సందర్శకులు మైమరిచిపోతుంటారు. అలాంటి వారి కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల తర్వాత మళ్లీ అరకు ఉత్సవ్ నిర్వహించడానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అరకు ఉత్సవ్ 2025 పేరిట ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది.


అరకులో గిరిజన పండుగ చలి నిర్వహణ కోసం రూ.కోటి మంజూరు చేస్తూ పర్యాటక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 తేదీ వరకూ అరకు గిరిజన పండుగ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. అరకులో చలి పండుగతో పాటు ఫిబ్రవరి 23 తేదీ నుంచి 25 తేదీ వరకూ మారేడుమిల్లిలో పర్యాటక కార్యక్రమాలు నిర్వహించేందుకు అల్లూరి జిల్లా కలెక్టర్ అనుమతి కోరారు. ఈ మేరకు అరకు గిరిజన పండుగ నిర్వహించేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసింది. పులికాట్ సరస్సుకు వచ్చే ఫ్లెమింగో పక్షుల సందర్శన కోసం ప్రతి ఏడాది నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ కోసం కూడా రూ.కోటి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


జనవరి 31 నుంచి 3 రోజులపాటు అరకులో చలి పండుగ జరగనుంది. దీనికి సంబంధించి చలి ఉత్సవం పేరుతో ప్రభుత్వం పోస్టర్లు విడుదల చేసింది. జిల్లా కలెక్టర్, అధికారులు. పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అభిషేక్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ అరకు లోయకు చేరుకుని చలి పండుగ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ ఉత్సవాలను విజయవంతం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. దేశంలోని గిరిజనుల సాంప్రదాయాలు, ఆచారాలను ఉత్సవాల ప్రాంగణంలో ప్రదర్శించేందుకు అనుమతిచ్చారు. స్టాల్స్‌ ఏర్పాటు చేయడానికి పలు స్థలాలను కేటాయించారు. జనవరి31న ఈ చలి పండుగకు ముందు, మారథాన్, స్పోర్ట్స్ ఈవెంట్‌లు.. పెయింటింగ్, రంగోలిలో పోటీలు కూడా నిర్వహించేలా ప్రభుత్వం రూపకల్పన చేపట్టింది.


ఈ వార్తలు కూడా చదవండి

YS Sharmila: అప్పుడు కనబడలేదా ఆర్థిక భారం.. షర్మిల ఫైర్

Tirumala: తిరుమలకు ఇస్రో ఛైర్మన్.. గగన్‌యాన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు..

Nara Lokesh: ఉద్యోగుల కాళ్ల దగ్గర మంత్రి నేమ్ ప్లేట్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 28 , 2025 | 08:21 PM

News Hub