Home » Arvind Kejriwal
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సెనా కీలక నిర్ణయం తీసుకున్నారు. నిషేధిత ఖలిస్థాన్ సంస్థల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ రూ.16 మిలియన్ యూఎస్ డాలర్లు అందుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సెనా సోమవారం సిఫార్స్ చేశారు.
ఇదీ సొంతంగా మేం సాధించిన ఘనత అని ఓటర్లకు చెప్పుకొనేందుకు ఏమీలేదు..! పదేళ్ల కిం దటి ‘మనవాడు ఒకరు తొలిసారి దేశ ప్రధాని కాబోతున్నాడు’ అనే వేవ్ కూడా లేదు..! ఐదేళ్లక్రితం నాటి జాతీయవాద ఉధృత పవనాలూ లేవు..! అలాగని వ్యతిరేకత ఏమీ కనిపించడం లేదు..! ఇదీ గుజరాత్లో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి..!
పార్లమెంట్ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ రిలీఫ్ కలిగింది. ఆ పార్టీ నేత, ఎమ్మెల్యే దిలిప్ పాండే రాసి, పాటిన పాటకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఆ పాటకు మార్పులు చేయడంతో ఈసీ ఎన్నికల్లో వాడుకునేందుకు అంగీకరించింది.
ఎన్నికల కారణంగా అరవింద్ కేజ్రీవాల్ కు తాత్కాలిక బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు శుక్రవారంనాడు పేర్కొంది. మే 7న పిటిషన్‌ను విచారిస్తామని తెలిపింది. వాదనలు వినిపించేందుకు సిద్ధమై రావాలని ఈడీ తరఫు న్యాయవాదులకు జస్టిస్ ఖన్నా, దీపంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal) ఓ పక్క జైలు శిక్ష అనుభవిస్తుండగా.. ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆప్ ప్రభుత్వం నియమించిన 223 మంది ఉద్యోగులను తొలగిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా(VK Saxena) సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన అరెస్టును వ్యతిరేకిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మంగళవారంనాడు విచారణ జరిగింది. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సమయంపై స్పందించాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ ని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ తరపున కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ లోక్‌సభ ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు. పార్టీ ఈస్ట్ ఢిల్లీ అభ్యర్థి కుల్దీప్ కుమార్ తరఫున శనివారంనాడు ప్రచారం సాగించారు. ఇందులో భాగంగా రోడ్‌షో నిర్వహించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికలకు వివిద దశల్లో పోలింగ్ జరుగుతుంది. అలాంటి వేళ.. దేశ రాజధాని ఢిల్లీలోని లోక్‌సభ స్థానాల్లో తమ సత్తా చాటాలని ఆప్ నిర్ణయించింది.
ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు ఎయిమ్స్ (AIIMS)కు చెందిన ఐదుగురు సభ్యుల మెడికల్ బోర్డు ధ్రువీకరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థిని మెడికల్ బోర్డు శనివారంనాడు పరిశీలించింది.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత.. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఢిల్లీ తూర్పు లోక్‌సభ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కులదీప్ కుమార్ బరిలో దిగారు.