Home » Budget 2024
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌ను ఎన్నికల్లో ఓడించి కామారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన కాటిపల్లి వెంకటరమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటుకు రూ. 500 కోట్ల నిధులను ఖర్చు చేయనున్నారు. ఈ మేరకు బడ్జెట్‌లో కేటాయింపులను చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నేషనల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా బడ్జెట్ ఉందని ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, రామచంద్రు నాయక్, అడ్లూరి లక్ష్మణ్ అన్నారు.
డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టింది ఆర్థిక బడ్జెట్టా? లేక అప్పుల పత్రమా? స్పష్టం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు.
అభూతకల్పన, అంకెల గారడి, ఆర్భాటం, సంతుష్టీకరణ తప్ప రాష్ట్ర బడ్జెట్‌లో ఏమీ లేదని కేంద్ర బొగ్గు,గనులశాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ఓ ప్రకటనలో విమర్శించారు.
ప్రభుత్వం ప్రకటించిన 2024-25 బడ్జెట్‌లో వయోవృద్ధులు, దివ్యాంగులు, నిరుపేదలకు ఇచ్చే పింఛను పెంపు మాటేలేదని, నిరుద్యోగ భృతి రూ.4వేలకు సంబంధించిన అంశమే లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపులేవని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్.. ఎన్నికల్లో గ్యారెంటీల గారడీ చేసిందని, ఇప్పుడు బడ్జెట్‌లో అంకెల గారడీ చేసింది తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.
‘‘బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని వంచించింది. వృత్తి కార్మికుల్ని వంచించింది. అంతా ట్రాష్. గ్యాస్. ఈస్ట్‌మన్ కలర్ మాదిరిగా చెప్పారు. ఓ కథ చెప్పినట్లు ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖకు రూ.29,816 కోట్లు కేటాయించింది. 2023-24లో ఈ శాఖకు కేటాయించిన రూ.31,426 కోట్లతో పోల్చితే ఈసారి రూ.1,610 కోట్లు తగ్గింది.
కాంగ్రెస్ సర్కారు ఒకవైపు వైద్య విద్యకు పెద్దపీట వేస్తూనే.. మరోవైపు ఆరోగ్యశ్రీ పథకానికి నిధుల్లో కోత పెట్టింది. ఆస్పత్రులు, మెడికల్, నర్సింగ్ కాలేజీల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించగా.. ఆరోగ్యశ్రీకి గత ఏడాది కంటే తక్కువ కేటాయించింది.