Share News

State debt: అమ్మో అప్పు1,94,531 తలసరి అప్పు..

ABN , Publish Date - Jul 26 , 2024 | 05:12 AM

రాష్ట్ర మొత్తం అప్పు మరింతగా పెరగబోతోంది. దీని వల్ల ప్రజలపై తలసరి అప్పు భారం కూడా పెరగనుంది.

State debt: అమ్మో అప్పు1,94,531 తలసరి అప్పు..

  • నానాటికి పెరుగుతున్న వైనం

  • ఈసారి తీసుకోనున్న అప్పు రూ.62,112 కోట్లు

  • రూ.7,33,869 కోట్లకు పెరగనున్న రాష్ట్ర మొత్తం అప్పు

హైదరాబాద్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మొత్తం అప్పు మరింతగా పెరగబోతోంది. దీని వల్ల ప్రజలపై తలసరి అప్పు భారం కూడా పెరగనుంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్ల కాలంలో రూ.6,71,757 కోట్ల అప్పు చేసినట్టు గురువారం శాసన సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.62,112 కోట్ల అప్పు తీసుకోబోతున్నట్టు ప్రతిపాదించింది.


దీన్ని కలిపితే రాష్ట్ర మొత్తం అప్పు రూ.7,33,869 కోట్లకు చేరనుంది. రాష్ట్ర అర్థ గణాంక సంచాలకుల కార్యాలయం ఇటీవల ప్రకటించిన వివరాల ప్రకారం రాష్ట్ర జనాభా 3,77,25,000. రాష్ట్ర మొత్తం అప్పును ఈ జనాభాతో భాగిస్తే తలసరి అప్పు రూ.1,94,531 ఉంటుందని తేలుతోంది. రాష్ట్ర అప్పు నానాటికీ పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.

Updated Date - Jul 26 , 2024 | 05:12 AM