Home » Chennai News
వాణియంబాడి సమీపం పెరియపేట్టై ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ మున్వర్బాషా కారు కొనేందుకు బ్యాంక్ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజులకు రూ 2.22 కోట్ల జీఎస్టీ(GST) బకాయిల నోటీసు అందింది.
సెంథిల్ బాలాజీ(Senthil Balaji) మంత్రిగా ఎలా కొనసాగుతున్నారంటూ సుప్రీంకోర్టు(Supreme Court) మళ్లీ నిలదీసింది. చట్టవ్యతిరేక నగదు బదిలీ కేసులో ఈడీ అరెస్ట్ చేయగా, సెంథిల్ బాలాజి 461 రోజులు జైలులో ఉండి, బెయిలుపై విడుదలయ్యారు.
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం మన్నార్జలసంధి వద్ద తీరం దాటడం, ఈశాన్య రుతుపవనాలు ఉగ్రరూపం దాల్చటంతో నగరంలో రెండు రోజుల పాటు భారీ వర్షం కురిసింది. దీంతో తల్లడిల్లిన నగరవాసులు, శుక్రవారం వరుణదేవుడు కాస్త విశ్రాంతి తీసుకోవడంతో ఊరట చెందారు.
టంగ్స్టన్ సొరంగం ఏర్పాటును విరమించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి(Union Minister Kishan Reddy)కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(Annamalai) వినతిపత్రం సమర్పించారు. ఈ విషయమై త్వరలో ఆశించిన ప్రకటన వెలువడుతుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని అన్నామలై తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మన్నార్ జలసంధి తీరం వైపు దూసుకురావటంతో రాష్ట్రమంతటా బుధవారం అర్ధరాత్రి నుండి గురువారం సాయంత్రం వరకూ భారీ వర్షం కురిసింది.
రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా వేర్వేరు ఘటనల్లో పాఠశాల విద్యార్థి, అయ్యప్య భక్తుడి సహా నలుగురు మృతిచెందారు. వారిలో ముగ్గురు విద్యుదాఘాతంతో మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో పది రోజుల కిత్రం ‘ఫెంగల్’ తుఫాన్ కారణంగా పలు ప్రాంతాల్లో పదిమంది మృతిచెందారు.
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం మన్నార్ జలసంధి తీరం వైపు కదులుతుండటంతో రాష్ట్రంలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తీవ్ర అల్పపీడనం వల్ల ఈశాన్య రుతుపవనాలు సైతం బలాన్ని పుంజుకున్నాయి.
కన్నియాకుమారి(Kanyakumari) జిల్లా కుళచ్చల్ నడి సముద్రంలో సరుకు నౌక ఢీకొనడంతో దెబ్బతిన్న పడవ నీటమునిగిన నేపథ్యంలో, పడవలో 9 మంది జాలర్లను సహచర జాలర్లు రక్షించారు. కుళచ్చల్ ఫిషింగ్ హార్బర్ నుంచి ఐదు రోజుల క్రితం ఫైబర్ పడవ(Fiber boat)లో 9 మంది జాలర్లు చేపల వేటకు వెళ్లారు.
రాష్ట్రంలో అడ్డూ అదుపూ లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్న బైక్ టాక్సీ(Bike taxi)లను అదుపు చేయడానికి రాష్ట్ర రవాణా శాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించే బైక్ టాక్సీలను స్వాధీనం చేసుకోవడంతో పాటు వాటిని నడిపేవారికి కూడా జరిమానా విధిస్తామని రవాణాశాఖాధికారులు హెచ్చరించారు.
కార్తీకదీపోత్సవం రోజున తిరువణ్ణామలై కొండపైకి భక్తులకు అనుమతి లేదని దేవాదాయ శాఖామంత్రి పీకే శేఖర్ బాబు(PK Shekhar Babu) తెలిపారు. అయితే, కొండ పైకి 11,600 మంది భక్తులను అనుమతించనున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.