Home » Kukatpally
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో అత్యంత అభివృద్ధి చెందిన కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ(కేపీహెచ్బీ) పరిధిలో మిగిలిన ప్లాట్ల(స్థలాలు)ను శుక్రవారం వేలం వేయనున్నామని గృహ నిర్మాణ శాఖ కమిషనర్, బోర్డు వైస్ చైర్మన్ వి.పి.గౌతమ్ తెలిపారు.
దశాబ్దాలుగా సరైన వసతులు లేక సమస్యలకు నిలయంగా మారిన బేగంపేట(Begumpet)లోని దనియాలగుట్ట హిందూ శ్మశానవాటిక ప్రస్తుతం అన్ని హంగులతో ఉద్యానవనంలా మారింది.
ప్రభుత్వం అంటే ప్రజల గురించి ఆలోచించాలి. ఆలయాలు, పాఠశాలల కోసం స్థలం వదిలి పెట్టకపోతే ఎలా ? స్థలాలను అమ్ముకొని సొమ్ము చేసుకోవడమే మీ పనా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana: కూకట్పల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్జున్ థియేటర్ దగ్గరలో ఉన్న కంచుకోట టిఫిన్ సెంటర్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన సమయంలో హోటల్ లోపల సిబ్బంది నిద్రిస్తున్నట్లు యజమాని తెలిపారు.
తెలంగాణ హౌసింగ్ బోర్డు పరిధిలోని చిన్న, చిన్న ప్లాట్లను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్కు ఉత్తరం, పడమర, దక్షిణ బోర్డు పరిధిలో ఉన్న 72 ప్లాట్లను త్వరలో విక్రయించేందుకు కసరత్తు పూర్తిచేసింది.
సంక్రాంతి పండుగకు సొంతూర్లకు బయలు దేరడంతో కూకట్పల్లి ప్రాంతంలోని బస్టాపులు ప్రయాణికులతో రద్దీగా మారాయి. నిజాంపేట్ క్రాస్రోడ్డు వద్ద ఉన్న జీపీఆర్ మల్టీప్లెక్స్ ఎదుట ఉన్న బస్టాపు, విశ్వనాథ్ థియేటర్ ముందున్న బస్టాపు, కూకట్పల్లిలోని ఆర్టీసీ బస్టాపులతో పాటు ట్రావెల్స్ బస్సులు హైదర్నగర్ నుంచి మూసాపేట్ చౌరస్తా వరకు ప్రయాణికులు లగేజీలతో బస్సుల కోసం గంటల కొద్దీ ఎదురుచూపులు తప్పలేదు.
కూకట్పల్లి రైతుబజార్(Kukatpally Raitu Bazar)లో కిలో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. టమోట రూ.11, వంకాయ రూ.23, బెండకాయ రూ.35, పచ్చి మిర్చి రూ.45, బజ్జి మిర్చి రూ.23, కాకరకాయ రూ.35, బీరకాయ రూ.38, క్యాబేజీ రూ.13, బీన్స్ రూ.45, క్యారెట్ రూ.35, గోబి పువ్వు రూ.25లకు విక్రయిస్తున్నారు.
తెలంగాణలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న ఆంధ్రప్రాంత వాసులపై వివాదాస్పద వ్యాఖ్య లు చేసిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి వ్యాఖ్యలు గర్హనీయమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) అన్నారు.
జేఎన్టీయూ(JNTU) విద్యార్థులకు కొత్త సంవత్సరంలో సరికొత్త సదుపాయాలు అందుబాట్లోకి రానున్నాయి. వర్సిటీలోని వివిధ విభాగాలతో పాటు అన్ని హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు నిరంతరాయమైన ఇంటర్నెట్ (హై-ఫై)సదుపాయాన్ని కల్పించాలని ఇన్చార్జి వీసీ డాక్టర్ బాలకిష్టారెడ్డి(In-charge VC Dr. Balakishta Reddy) నిర్ణయించారు.
కూకట్పల్లి(Kukatpally) ఆర్టీసీ డివిజన్ పరిధి లింగంపల్లి నుంచి ఎన్జీవో కాలనీ వరకు గ్రీన్ ఎలక్ట్రిక్ మెట్రో బస్సులు ఏర్పాటు చేసినట్టు డిప్యూటీ ఆర్ఎం కవితరూపుల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.