Sankranti festival: సంక్రాంతికి సొంతూర్లకు చలో..
ABN , Publish Date - Jan 11 , 2025 | 08:46 AM
సంక్రాంతి పండుగకు సొంతూర్లకు బయలు దేరడంతో కూకట్‌పల్లి ప్రాంతంలోని బస్టాపులు ప్రయాణికులతో రద్దీగా మారాయి. నిజాంపేట్ క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న జీపీఆర్ మల్టీప్లెక్స్ ఎదుట ఉన్న బస్టాపు, విశ్వనాథ్ థియేటర్ ముందున్న బస్టాపు, కూకట్‌పల్లిలోని ఆర్టీసీ బస్టాపులతో పాటు ట్రావెల్స్ బస్సులు హైదర్‌నగర్ నుంచి మూసాపేట్ చౌరస్తా వరకు ప్రయాణికులు లగేజీలతో బస్సుల కోసం గంటల కొద్దీ ఎదురుచూపులు తప్పలేదు.
- ప్రయాణికులతో రద్దీగా బస్టాపులు
హైదరాబాద్: సంక్రాంతి పండుగ(Sankranti festival)కు సొంతూర్లకు బయలు దేరడంతో కూకట్‌పల్లి ప్రాంతంలోని బస్టాపులు ప్రయాణికులతో రద్దీగా మారాయి. నిజాంపేట్ క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న జీపీఆర్ మల్టీప్లెక్స్ ఎదుట ఉన్న బస్టాపు, విశ్వనాథ్ థియేటర్ ముందున్న బస్టాపు, కూకట్‌పల్లిలోని ఆర్టీసీ బస్టాపులతో పాటు ట్రావెల్స్ బస్సులు హైదర్‌నగర్ నుంచి మూసాపేట్ చౌరస్తా వరకు ప్రయాణికులు లగేజీలతో బస్సుల కోసం గంటల కొద్దీ ఎదురుచూపులు తప్పలేదు.
ఈ వార్తలను కూడా చదవండి: Hyderabad: అప్పు తిరిగివ్వమంటే హత్య చేశాడు..
ప్రయాణికులు అంతా ఏపీ వైపే..
కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, నిజాంపేట్ రోడ్డు(Kukatpally, KPHB, Nizampet Road) పరిసర ప్రాంతాల్లో నివాసాలు ఉంటున్న ఏపీ వాసులు సొంతూర్లకు ప్రయా ణం కావడంతో ఆయా మార్గాల్లో సాధారణ ప్రజానికం ఇబ్బందులు పడ్డారు. కార్లలో ప్రయాణించే వారు ట్రాఫిక్ చిక్కుల్లో చిక్కుకొని రోడ్లపైనే గడిపారు. ఈనెల 11వ తేదీ నుంచే విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వడంతో శుక్రవారం రాత్రి 7 గంటల నుంచే గ్రామాలకు వెళ్లేందుకు ప్రయాణికులు బస్టాపులకు చేరుకున్నారు.
దీంతో హైదర్‌నగర్ నుంచి మూసాపేట్ చౌరస్తా వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆర్టీసీ బస్సులకు తోడు ప్రైవేటు ట్రావెల్స్ రోజూ వారికంటే ఎక్కువగా నడపడడంతో ఆయా మార్గాల్లో రద్దీ ఏర్పడిందనే చెప్పొచ్చు. ట్రాఫిక్ పోలీసు లు కూడా ఒక్కసారిగా వేల మంది ప్రయాణికులు బస్టాపులకు రావడంతో కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. చిన్నారులను చంకలో పెట్టుకొని బస్సులోకి ప్రవేశించడం మహిళలు కష్టంగా మారింది. బస్టాపుల్లో ఆగాల్సిన బస్సులు జాతీయ రహదారిపైనే నిలిపి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో ట్రాఫిక్ తీవ్రత మరింత పెరిగింది.
అర్ధరాత్రి 12 గంటల వరకు బస్సులు నడపడంతో ప్రయాణికులు గంటల కొద్దీ తమ ఊరు వెళ్లే బస్సు కోసం పడిగాపులు కాసి ఎట్టకేలకు బస్సు ఎక్కి వెళ్లిపోయారు. ఈనె 11, 12, 13వ తేదీ వరకు సంక్రాంతికి సొంతూరు వెళ్లేందుకు బస్సుల్లో రిజర్వేషన్లు చేసుకున్నారని ఆర్టీసీ సిబ్బంది చెప్పా రు. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ నుంచి విముక్తి పొందేందుకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రయాణికులు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. ఒకరోజు లేటు అయినా పర్వాలేదు.. భోగిరోజు రాత్రి కూడా బస్సులన్నీ ఫుల్ అయ్యాయని తెలిపారు. ఆర్టీసీ, ప్రైవేటు ట్రావె ల్స్ అన్నీ ఏపీ వైపే నడిపి సొమ్ము చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయని చెప్పవచ్చు.
ఈవార్తను కూడా చదవండి: Travel Rush: పట్నం బైలెల్లినాదో!
ఈవార్తను కూడా చదవండి: HMDA: మహా అప్పు కావాలి!
ఈవార్తను కూడా చదవండి: నిర్మాణంలోని 11 విల్లాలు నేలమట్టం
ఈవార్తను కూడా చదవండి: నాకు ఆ భూమితో సంబంధం లేదు..
Read Latest Telangana News and National News