Home » Manipur
దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన మణిపుర్ అల్లర్ల కేసులో సీబీఐ(CBI) ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. ఇందులో మణిపుర్ పోలీసుల వైఖరి, వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అల్లరి మూకల దాడులు జరుగుతున్న క్రమంలో సాయం కోరడానికి వచ్చిన బాధితులను ఏ మాత్రం పట్టించుకోకుండా మూకలకు సహకరించారని ఛార్జ్ షీట్లో వెల్లడించారు.
లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్‌లో భాగంగా ఈనెల 26న హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న ఔటర్ మణిపూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని 6 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ కు భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. ఏప్రిల్ 30న ఇక్కడ రీపోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించింది.
పశ్చిమబెంగాల్ సీఎం మమత మరోసారి గాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బర్ధమాన్ జిల్లాలోని దుర్గాపూర్ నుంచి అసన్సోల్కు వెళ్లేందుకు శనివారం ఆమె హెలికాప్టర్ ఎక్కారు.
మణిపుర్లో తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బిష్ణూపుర్ జిల్లాలోని భద్రతా సిబ్బంది శిబిరంపై కాల్పులకు తెగబడడంతో ఇద్దరు జవాన్లు మరణించారు.
మణిపూర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శనివారం ఇన్నర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గంలోని 11 పోలింగ్ స్టేషన్లలో ఏప్రిల్ 22న రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 19న ఈ పోలింగ్ స్టేషన్లలో జరిగిన ఓటింగ్ చెల్లదని ప్రకటించి తాజాగా ఓటింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) తొలి విడత పోలింగ్‌లో భాగంగా మణిపూర్‌లో శుక్రవారంనాడు హింసాత్మక ఘటనలు వెలుగుచూశాయి. బూత్‌లను స్వాధీనం చేసుకోవడం, ఈవీఎంల ధ్వంసం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇంఫాల్ ఈస్ట్‌లోని ఖోంగ్మాన్‌లో ఎన్నికల ప్రకియను అడ్డుకునేందుకు సాయుధ దుండగులు ఓ పోలింగ్ బూత్‌లలోకి ప్రవేశించారని, ప్రాక్సీ ఓటింగ్ చేశారని వార్తలు వెలువడ్డాయి.
చొరబాటు ద్వారా మణిపుర్ జనాభాను మార్చే ప్రయత్నాలు జరిగాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) సంచలన ప్రకటన చేశారు. మణిపుర్ ను విచ్ఛిన్నం చేసే శక్తులు, ఐక్యం చేసే శక్తుల మధ్య లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు.
రాష్ట్రంలో గత ఏడాది మే మాసంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ నిర్వహించే రోజులతోపాటు కౌంటింగ్ ప్రక్రియ జరిగే రోజు.. రాష్ట్రంలో మద్యం విక్రయాలు నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో రైఫిళ్లు కలిగి ఉన్న నలుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు SLR రైఫిల్స్‌తో పాటు ఏడు మొబైల్ ఫోన్లు, ఒక వాకీ టాకీ సెట్, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అరెస్టైన వారిలో సలాం రామేశ్వర్ సింగ్, టోంగ్‌బ్రామ్ గ్యాంజిత్ సింగ్ అలియాస్ చింగ్లెన్సనా, పుఖ్రేమ్ ఇంగోచా సింగ్, తోక్చోమ్ టెంబా అలియాస్ వఖీబా ఉన్నారు.
సీఏఏపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు రాజుకుంటున్నాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని కొందరు వ్యతిరేకిస్తుండగా మరికొందరు స్వాగతిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు రాజకీయ నేతలు చేసిన కామెంట్లు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.