Rahul Gandhi: మణిపూర్‌లో పర్యటించనున్న రాహుల్.. ఎప్పుడంటే..?
ABN , Publish Date - Jul 06 , 2024 | 08:28 PM
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్, గుజరాత్‌లోని టీఆర్‌పీ గేమ్ జోన్ ఫైర్, మోర్బీ వంతెన కుప్పకూలిన ఘటనల్లో బాధితులను శుక్ర, శనివారాల్లో పరామర్శించిన కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తాజాగా మణిపూర్‌లో పర్యటించనున్నారు. జూలై 8న ఆయన మణిపూర్‌లో పర్యటించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్, గుజరాత్‌లోని టీఆర్‌పీ గేమ్ జోన్ ఫైర్, మోర్బీ వంతెన కుప్పకూలిన ఘటనల్లో బాధితులను శుక్ర, శనివారాల్లో పరామర్శించిన కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తాజాగా మణిపూర్‌లో పర్యటించనున్నారు. జూలై 8న ఆయన మణిపూర్‌లో పర్యటించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. 2023 మే నుంచి జాతుల ఘర్షణల మధ్య హింసాకాండతో మణిపూర్ కకావికలవుతోంది.
Rahul Gandhi: అయోధ్యలో ఓడించాం, ఇక గుజరాత్ వంతు..
కాగా, మణిపూర్ పర్యటనలో భాగంగా పునరావాస శిబిరాలలో తలదాచుకుంటున్న బాధితులను రాహుల్ పరామర్శిస్తారు. మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలతోనూ సమావేశమవుతారు. మణిపూర్‌లో ఏడాదిగా కొనసాగుతున్న హింసాకాండంపై కాంగ్రెస్ తరచు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తోంది. మెయితీ కమ్యూనిటీని షెడ్యూల్డ్ తెగల కేటగిరిలో చేర్చాలనే డిమాండ్‌కు వ్యతిరేకంగా ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ (ఏటీఎస్‌యూ) ర్యాలీ నిర్వహించడంతో గత ఏడాది మే 3న మణిపూర్‌లో పెద్దఎత్తున హింసాకాండ చెలరేగింది. ఈ అల్లర్లలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా, పెద్ద సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. మణిపూర్ అంశాన్ని ఇటీవల ముగిసిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో విపక్ష కాంగ్రెస్ లేవనెత్తగా, రాష్ట్రంలో యథాపూర్వ పరిస్థితి పునరుద్ధరించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని, 11 వేలకు పైగా ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి 500 మందికి పైగా అరెస్టులు చేశామని, హింసాత్మక ఘటనలు చాలా ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మణిపూర్‌లోని రెండు సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది.
For Latest News and National News click here