Imphal: సీఎం నివాసం సమీపంలో భారీ అగ్నిప్రమాదం
ABN , Publish Date - Jun 15 , 2024 | 08:38 PM
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ బంగ్లా సమీపంలో ఎవరూ లేని ఒక భవంతిలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చెలరేగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో నాలుగు అగ్నిమాపక శకటాలు అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశాయి.
ఇంఫాల్: మణిపూర్ (Manipur) ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ (N.Biren singh) బంగ్లా సమీపంలో ఎవరూ లేని ఒక భవంతిలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చెలరేగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో నాలుగు అగ్నిమాపక శకటాలు అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఇంఫాల్‌లోని కుకీ ఇన్ కార్యాలయానికి పక్కనే ఉన్న ఈ భవంతిలో మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు. కుకీ అన్ అనేది కుకీల కమ్యూనిటీ హాల్ అని, ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉన్నాయని చెప్పారు.
Read Latest National News and Telugu News