Home » Politicians
విదేశాంగ శాఖ మాజీ మంత్రి కే నట్వర్‌సింగ్(93) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొన్నాళ్లుగా గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దౌత్య, రాజకీయ రంగాలతో పాటు రచనా వ్యాసంగంలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు.
ప్రపంచంలో యువకులు అత్యధికంగా ఉన్నది భారత్‌లోనే. మరి వయస్సు పైబడిన వారు ఎక్కువగా ఉన్నది ఏ రంగంలో అంటే టక్కున గుర్తొచ్చేది రాజకీయాలే. ఇదే అంశాన్ని లేవనెత్తారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha) .
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో తమ సామాజికవర్గానికి చోటు కల్పించాలని లంబాడీ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది.
ఎమర్జెనీ సమయంలో మినహా మిగతా కాలమంతా పార్లమెంటు బాగానే పనిచేసిందని రాజ్యసభ చైర్పర్సన్ జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు. పార్లమెంటు సభ్యులు దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించారని కొనియాడారు.
ఓటుకు నోటు కేసును వేరే రాష్ట్రానికి ఎందుకు మార్చాలని సుప్రీం కోర్టు నిలదీసింది. నిందితుడు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కోర్టులు ప్రభావితం అవుతాయా? అంటూ అసహనం వ్యక్తం చేసింది.
హత్రాస్ తొక్కిసలాట ఘటనను రాజకీయం చేయాలని తాను భావించటంలేదని, అయితే, ఈ విషాదం వెనుక ప్రభుత్వ యంత్రాంగ పరంగా పలు లోపాలున్నాయని కాంగ్రెస్ అగ్ర నాయకుడు....
‘‘సరైన సమయంలో, కాకతాళీయంగా తల తిప్పాను. లేకపోతే చనిపోయి ఉండేవాడిని. దేవుడి దయ, అదృష్టం వల్ల బతికి ఉన్నాను’’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కోర్టుల్లో ఉపశమనం లభిస్తున్నప్పటికీ, ఆయనకు జైలు కష్టాలు తొలగడం లేదు. కార్ప్స్ కమాండర్ హౌస్‌పై దాడి, మే 9 అల్లర్లు సహా మొత్తం 12 కేసుల్లో తాజాగా ఆయనను లాహోర్ పోలీసులు అరెస్టు చేశారు.
జేపీ నడ్డా స్థానంలో బీజేపీ నూతన జాతీయ అధ్యక్ష ఎన్నికకు కసరత్తు మొదలైంది. డిసెంబరు నెలాఖరులోపు కొత్త సారథి ఎన్నిక పూర్తికానుంది. ఆయన పదవీకాలం ఎప్పుడో పూర్తయింది.
లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎంపీ గౌరవ్ గొగోయ్‌కు ఆ పార్టీ మరోసారి అవకాశమిచ్చింది. చీఫ్ విప్‌గా సీనియర్ నేత కొడికున్నిల్ సురేశ్, విప్‌లుగా మాణిక్కం ఠాగూర్, మహమ్మద్ జావేద్‌లను నియమించింది.